ఈ హోళీ కి మీ ఇంట 'రంగ రంగ వైభవంగా' అంటూ రంగులు వెదజల్లడానికి వస్తుంది మన జీ తెలుగు

వసంత ఋతువులో వచ్చే తొలి వేడుక హోళీ.చలికి వీడ్కోలు పలికి హోళికా దహన కాంతులు హోళీ.

 Mana Zee Telugu Comes To Scatter The Colors Of This House Saying 'ranga Ranga Va-TeluguStop.com

రాధా కృష్ణుల ప్రేమ గీతాల గాన విభావరి హోళీ.విశ్వంలోని రంగులన్ని కలిసి చేసే కోలాహలమే హోళీ.

ఇలాంటి హోళీని ఈసారి మరింత అందంగా ‘రంగ రంగ వైభవంగా‘ అనే కార్యక్రమంతో మనముందుకు తీసుకొని రాబోతుంది జీ తెలుగు.ఈ ఆదివారం సాయంత్రం 6 గంటలకు, మార్చ్ 20 నాడు ప్రసారం చేయనున్నది.

‘రంగ రంగ వైభవంగా’ కార్యక్రమానికి టాలీవుడ్ ముద్దుగుమ్మ క్రితి శెట్టి స్పెషల్ గెస్ట్ గా విచ్చేయనున్నారు.వీరితోపాటు ఈ వేడుకను మరింత సంబరంగా చేయడానికి మన అందరికి ఎంతో ఇష్టమైన ప్రదీప్ మాచిరాజు యాంకర్ గా వ్యవహరిస్తున్నారు.

ప్రదీప్ తన ప్రేమను క్రితి కోసం తులు భాషలో వ్యక్తపరిచి, షిప్ లో కాండిల్ లైట్ డిన్నర్ కి కూడా తీసుకెళ్తాడు.మరి ప్రదీప్ ప్రేమ లీలలు క్రితిని ఆకట్టుకుంటాయా? లేదా? తెలియాలంటే ఈ ఆదివారం సాయంత్రం 6 గంటలకు జీ తెలుగు తప్పక చూడాల్సిందే.

ఈ వేడుకలో మరిన్ని రంగులు వెదజల్లడానికి మన సీరియల్ స్టార్స్ మరియు రియాలిటీ స్టార్స్ మధ్య పోటీ జరగబోతుంది. సీరియల్ స్టార్స్ లీడర్ గా అకుల్ బాలాజీ వ్యవహరించగా, ఆయన టీం నుండి అందరిని తమ ఆటపాటలతో ఆకట్టుకోవడానికి వస్తున్నారు శ్రీ సత్య – అమరదీప్, అనూష – ప్రతాప్, చందు – ఆషిక, నాగార్జున – ఐశ్వర్య, నిఖిల్ – కావ్య, పవన్ – యుక్త, సిద్ధార్థ్ – నిషా, మరియు నిరుపమ్ – మంజుల.

అంతేనా, వీరికి సై అంటే సై అని దూసుకొస్తున్నారు రియాలిటీ స్టార్స్.వారిని ముందుండి నడిపించడానికి శ్రీముఖి వస్తున్నారు.

ఆ టీం నుండి అందరిని అదరహో అని ఆశ్చర్యపరిచేలా సూపర్ క్వీన్స్ పర్ఫాం చేయగా, సద్దాం మరియు టీం అందరిని కడుపుబ్బా నవ్వించగా, స రి గ మ ప 13 మరియు ప్రస్తుత కంటెస్టెంట్స్ 50 మాషప్ పాటలు పాడి సందడి చేయబోతున్నారు.చదువుతున్న కొద్దీ చూడాలనిపిస్తుంది కదా? ఇవన్నీ చూడాలంటే జీ తెలుగు తప్పక వీక్షించండి.

ఈ హోళీ ని మరింత ఆహ్లాదంగా చేయడానికి వస్తుంది జీ తెలుగు ‘రంగ రంగ వైభవంగా’ తో ఈ ఆదివారం 20 మార్చి సాయంత్రం 6 గంటలకు.తప్పక వీక్షించండి!

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube