కాశ్మీర్ ఫైల్స్ ... బాలీవుడ్ పాపాలను కడిగే అద్భుతమైన సినిమా: కంగనా

వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వంలో 1990లో జమ్మూ కశ్మీర్ పండిట్ల వలసలు, వారు పడ్డ ఇబ్బందుల గురించి తెలియజేస్తూ ఎంతో అద్భుతంగా తెరకెక్కించిన సినిమా ది కాశ్మీర్ ఫైల్స్. ఈ సినిమా విడుదలయి అద్భుతమైన ప్రేక్షకాదరణ దక్కించుకుంది.

 Kangana Comments On The Kashmir Files Movie And Bollywood Details, Kangana, Bol-TeluguStop.com

ప్రస్తుతం ఎక్కడ చూసినా ఈ సినిమా గురించి పెద్ద ఎత్తున మాట్లాడటమే కాకుండా ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమాని కాంట్రవర్సి క్వీన్ కంగనా రనౌత్ చూశారు.

ఈ సినిమా చూసిన అనంతరం ఈ ముద్దుగుమ్మ తన అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.

ఈ సందర్భంగా కంగనా మాట్లాడుతూ… బాలీవుడ్ చేసిన పాపాలను కడిగేసే అద్భుతమైన సినిమానే ది కాశ్మీర్ ఫైల్స్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఎంతో అద్భుతమైన సినిమాని తెరకెక్కించినందుకు చిత్ర బృందానికి ఈమె అభినందనలు తెలియజేశారు.ఇలా ఈ సినిమాని చూసిన ఈమె తన అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా బయటపెట్టారు.ఇక ఈ సినిమా చూసిన అనంతరం ఆమె తన అభిప్రాయాన్ని వీడియో రూపంలో వెల్లడిస్తూ ఆ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేశారు.

Telugu Actresskangana, Bollywood, Kangana, Kashmir-Movie

ఇంత అద్భుతమైన సినిమాని తీసినందుకు చిత్ర బృందానికి అభినందనలు తెలియ చేయడమే కాకుండా బాలీవుడ్ చేసిన పాపాలను కూడా ప్రక్షాళించారు.ఇండస్ట్రీలో ఎలకలుగా దాగి ఉన్న వారందరూ కూడా బయటకు వచ్చి ఈ సినిమాను ప్రోత్సహించాలి అంటూ ఈమె వీడియో ద్వారా తన అభిప్రాయాన్ని వెల్లడిస్తూ బాలీవుడ్ ఇండస్ట్రీ పై మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు.పనికిమాలిన సినిమాలను ప్రోత్సహించే బదులు ఇలాంటి సినిమాలను ప్రోత్సహించాలని ఈమె పిలుపునిచ్చారు.

మొత్తానికి కంగనా చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube