బిగ్ బాస్ నాన్ స్టాప్...ఈవారం నామినేషన్ లో ఉన్న కంటెస్టెంట్ లు వీళ్లే?

బుల్లితెరపై ప్రసారం అవుతూ మంచి ప్రేక్షకాదరణ దక్కించుకున్న బిగ్ బాస్ రియాలిటీ కార్యక్రమం ప్రస్తుతం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ప్రసారం అవుతూ ప్రేక్షకులను మరింత సందడి చేస్తోంది.ఈ క్రమంలోనే ఈ కార్యక్రమం ఇప్పటికే రెండు వారాలు పూర్తి చేసుకొని బిగ్ బాస్ హౌస్ నుంచి ఇద్దరు కంటెస్టెంట్ లో ఎలిమినేట్ అయ్యారు.

 Bigg- Boss Non Stop Who Are The Contestants Nomination This Week Bigg Boss Non S-TeluguStop.com

మొదటి వారం ముమైత్ ఖాన్ హౌస్ నుండి ఎలిమినేట్ కాగా రెండవ వారం శ్రీ రాపాక బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చారు.ఇలా మొదటి రెండు వారాలు చాలెంజర్స్, వారియర్స్ నుంచి ఒక్కొక్కరు ఎలిమినేట్ అయ్యారు.

ఇక మూడవ వారంలో భాగంగా నామినేషన్లు ఎంతో వేడిగా జరిగినట్లు తెలుస్తోంది.హోలీ సందర్భంగా బిగ్ బాస్ ఈవారం నామినేషన్ ప్రక్రియలో భాగంగా రంగులతో నామినేట్ చేసినట్లు తెలుస్తోంది.

ఇక నామినేషన్ ప్రక్రియలో భాగంగా తేజస్వి, అరియాన ఒకరినొకరు నామినేట్ చేసుకున్నారు.ఇక ఈ వారం నామినేషన్ ప్రక్రియలో మాటల యుద్ధం జరిగినట్లు తెలుస్తోంది.

ఇక ఈ వారం కెప్టెన్ అనిల్ కావడంతో అతని నామినేట్ చేయడానికి వీలులేదు.

Telugu Anil, Ariana, Ashu Reddy, Bigg Boss, Sarayu, Tejaswi, Telugu, Tollywood-M

ఇక ఈ వారం బిగ్ బాస్ హౌస్ లో 15 మంది కంటెస్టెంట్ లు ఉండగా వీరిలో సరయు, అషూ రెడ్డి, కెప్టెన్‌ అనిల్‌ మినహా మిగిలిన 12 మంది కంటెస్టెంట్ లు నామినేషన్ లో ఉన్నారు.మరి ఈ వారం ఏకంగా 12 మంది కంటెస్టెంట్ లు నామినేషన్ లో ఉండగా ఎవరు బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ కానున్నారనే విషయం గురించి ఎంతో ఆతృత ఏర్పడింది.మరి ఈ వారం బిగ్ బాస్ హౌస్ లో నుంచి ఎవరు బయటకు రానున్నారనే విషయం మరి కొద్ది రోజులలో తెలియనుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube