9999 మేకులపై కూచిపూడి నృత్యం.. అదరహో అనిపించిన యువతి

మాములూగా చెప్పులు లేకుండా నడవాలంటేనే కష్టం.అలాంటింది ఓ యువతి చెప్పులేకుండా 9999 మేకులపై కూచిపూడి నృత్యం వేసి రికార్డులను బద్దలు కొట్టింది.

 Kuchipudi Dancer Likhita Creates World Record On 9999 Nails Details, 9999,dance,-TeluguStop.com

ప్రపంచంలో ఉన్న అన్ని రికార్డులను తన పేరిట రాసుకుంది.ఈ అధ్భుత నృత్య ప్రదర్శన హైదరాబాద్ లోని పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ ఎన్టీఆర్ కళా మందిరంలో జరిగిన ఓ కార్యక్రమంలో యువ నర్తికి పీసపాటి లిఖిత 9 నిమిషాల పాటు అమ్మవారిని స్మరిస్తూ 9 శ్లోకాలకు లయబద్ధకంగా నృత్యం వేసింది.

అమె కూచిపూడి నాట్యం అక్కడి అందరినీ అలరించింది.తొమ్మిది నిమిషాలకు పాటు ప్రేక్షకుల చూపును కట్టిపారేసింది.

వనీ నృత్యాలయం ఆధ్వర్యంలో ఐఎస్ విజేందర్, , ఏ.ధనలక్ష్మీ పర్యవేక్షణల్లో లికిత నవదుర్గ అంశంతో ప్రత్యేక ప్రయోగం చేసి విజయవంతంగా ముగించింది.ప్రపంచ రికార్డులను సాధించిన అమెకు ప్రతినిధులు సర్టిఫికెట్లు అందించి ఘనంగా సన్మానించారు.

వరల్డ్ రికార్డ్స్, భారత్ రికార్డ్స్, టాలెంట్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు, ట్రెడిషనల్ వరల్డ్ రికార్డు, వండర్ ఇండియా రికార్డు, ఢీల్లీ బుక్ ఆప్ రికార్డ్స్, సంస్కృతి సంప్రదాయ బుక్ రికార్డ్స్, సకల కళాకారుల ప్రపంచ పుస్తకం, ఎక్స్ ట్రాడినరీ బుక్ ఆఫ్ రికార్డ్స్,ఫైడ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కోసం లిఖిత కూచిపూడి నృత్యం చేసింది.

Kuchipudi Dancer Likhita Creates World Record On Nails Details

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube