పుతిన్, అతని యుద్ధానికి, రష్యన్లకు వ్యతిరేకంగా హేట్ పోస్టులు పెట్టొచ్చని ఇటీవలే ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ప్రకటించిన విషయం తెలిసిందే.దీనివల్ల రష్యాలో హింసాత్మక చర్యలు పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేశారు.
ఈ క్రమంలోనే వీటివల్ల రష్యాలో హింసాత్మక ఘటనలు వెల్లువెత్తే ప్రమాదం ఉందని పుతిన్ వీటిని బ్యాన్ చేసాడు.ఇంతకుముందు ఫేస్‌బుక్ బ్యాన్ అవ్వగా ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్ కూడా నిషేధిత జాబితాలోకి చేరింది.
ఇన్‌స్టాగ్రామ్ బ్యాన్ కావడంతో ఒక రష్యన్ మహిళ ఎక్కెక్కి ఏడ్చింది.దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతోంది.
ఇన్‌స్టాగ్రామ్ బ్యాన్ అయినంత మాత్రాన అలా ఏడవాలా? అని అడిగితే పీత కష్టాలు పీతవి అన్నట్లు ఈమె సమాధానం చెబుతోంది.
ఈ రోజుల్లో చాలామందికి సోషల్ మీడియానే మెయిన్ ఇన్‌కమ్ సోర్స్ గా నిలుస్తోంది.
అలాంటిది ఒకేసారి సోషల్ మీడియా దూరమైతే ఎలాంటి పరిస్థితి ఎదురవుతుందో అర్థం చేసుకోవచ్చు.అయితే ఇలాంటి పరిస్థితుల్లో అది దూరం అయిందని అర్థం చేసుకుని అందుకు అనుగుణంగా స్పందించాల్సి ఉంటుంది.
కానీ తాజాగా ఇన్‌స్టాగ్రామ్ బ్యాన్ కావడంతో ఒక రష్యన్ ఇన్‌ఫ్లూయెన్సర్ తన చుట్టుపక్కల ఏం జరుగుతుందో పట్టించుకోకుండా బోరున విలపించింది.అంతేకాదు తనకి యావత్ ప్రపంచం సింపతీ చూపిస్తుంది అనుకొని ఒక వీడియో కూడా పెట్టింది.“ఇన్‌స్టాగ్రామ్ కేవలం ఒక ఆదాయవనరు మాత్రమే కాదు అదే నా జీవితం.తెల్లారిలేస్తే అదే నా ప్రపంచం, రాత్రి పడుకునేటప్పుడు కూడా అది తప్ప నా జీవితంలో మిగతాదేదీ ప్రపంచం కాదు.
ఐదేళ్లుగా ఇన్‌స్టాగ్రామ్‌తో ఏర్పడిన బంధమిది.చాలా బాధేస్తోంది” అంటూ ఆమె ఒక వీడియోలో చెబుతూ ఏడ్చేసింది.

అయితే ఇది చూసిన చాలా మంది ఆమె పై విమర్శలు కురిపిస్తున్నారు.“యుద్ధం వల్ల ఒకవైపు ఉక్రెయిన్ ప్రజలు తమ జీవితాన్నే కోల్పోతే నువ్వేమో ఇన్‌స్టాగ్రామ్ పోయినందుకే ఏడుస్తున్నావ్! నువ్వు ఇలా ఏడ్చినంత మాత్రాన ఎవరూ నీపై జాలి, దయ చూపించరు.రెస్టారెంట్లో ఫుడ్ పిక్స్ పోస్ట్ చేసే వీలు లేదని ఈ పిల్ల ఏడుస్తోంది.అసలు కొంచెమైనా బుద్ధుందా? ఉక్రెయిన్ లో ఏం జరుగుతుందో ఈమెకు తెలీదు అనుకుంటా.ఇంత స్వార్థపూరితంగా ఎలా ఉంటారు” అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.నెక్స్టా టీవీ ట్విట్టర్ హ్యాండిల్ షేర్ చేసిన ఈ వీడియోకి ఇప్పటికే 18 లక్షల వ్యూస్ వచ్చాయి.
దీనిపై మీరు కూడా ఓ లుక్కేయండి.







