తక్కువ సినిమాలే చేసినా ప్రేక్షకుల్లో మంచి గుర్తింపును సంపాదించుకున్న హీరోయిన్లలో వర్ష బొల్లమ్మ ఒకరనే సంగతి తెలిసిందే.తమిళంలో విజయ్ సేతుపతి హీరోగా తెరకెక్కిన 96 సినిమాలో వర్ష బొల్లమ్మ చిన్నపాత్రలో నటించి మెప్పించారు.
తెలుగులో తెరకెక్కిన 96 రీమేక్ జాను సినిమాలో కూడా అదే పాత్రలో నటించి వర్ష బొల్లమ్మ తన నటనతో ఆకట్టుకున్నారు.వర్ష బొల్లమ్మ నటించిన మిడిల్ క్లాస్ మెలోడీస్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.
వర్ష బొల్లమ్మ నటించిన స్టాండప్ రాహుల్ ఈ నెల 18వ తేదీన రిలీజ్ కానుంది.ఈ మధ్య కాలంలో సరైన సక్సెస్ లేని రాజ్ తరుణ్ ఈ సినిమాతో సక్సెస్ ట్రాక్ ఎక్కుతానని నమ్మకంతో ఉన్నారు.
సాంటో ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండటం గమనార్హం.వర్ష బొల్లమ్మ తాజా ఇంటర్వ్యూలో తన పెళ్లి, ప్రెగ్నెన్సీకి సంబంధించి వైరల్ అయిన వార్తల గురించి స్పందించి స్పష్టతనిచ్చారు.

తనకు పెళ్లైతే ఏమిటని కాకపోతే ఏమిటని ఆమె కామెంట్లు చేశారు.పెళ్లి అనేది నా వ్యక్తిగత విషయమని ఆమె చెప్పుకొచ్చారు.ఆ తర్వాత తనకు పెళ్లైందని అయితే పెళ్లి నిజంగా కాలేదని సినిమాలో అయిందని ఆమె కామెంట్లు చేశారు.తాను గర్భవతి అని వైరల్ అయిన వార్తలపై స్పందిస్తూ తన బుగ్గల వల్ల ఆ వార్త ప్రచారంలోకి వచ్చిందని వర్ష బొల్లమ్మ వెల్లడించారు.
తన ఎత్తు గురించి వర్ష మాట్లాడుతూ తన ఎత్తు 5 ‘ 11 అని అన్నారు.

అయితే రాజ్ తరుణ్ మాత్రం ఎత్తు 5 ‘ 3, 5 ‘ 4 అంటూ అసలు విషయం చెప్పుకొచ్చారు.డ్రీమ్ టౌన్ ప్రొడక్షన్స్, హై ఫైవ్ పిక్చర్స్ బ్యానర్లపై ఈ సినిమా తెరకెక్కింది.వరుసగా సినిమాలు ఫ్లాప్ అవుతున్నా స్టాండప్ రాహుల్ సినిమాతో రాజ్ తరుణ్ ఖాతాలో విజయం చేరుతుందేమో చూడాల్సి ఉంది.
సినిమాసినిమాకు రాజ్ తరుణ్ కు క్రేజ్ అంతకంతకూ పెరుగుతోంది.







