టిక్ టాక్ ద్వారా గుర్తింపు దక్కించుకున్న వారిని, ఇంస్టాగ్రామ్ లో పాపులర్ అయిన వారిని తన యూట్యూబ్ ఛానల్ లో ఇంటర్వ్యూ లు చేస్తూ అందరి దృష్టిని ఆకర్షించిన యాంకర్ శివ ఇప్పుడు బిగ్ బాస్ నాన్స్టాప్ లో సందడి చేస్తున్నాడు.యాంకర్ గా మొదట ప్రయత్నాలు చేసినా శివ మొదట ఫ్లాప్ అయినా ఆ తర్వాత సొంతంగా ఇంటర్వ్యూలు చేస్తూ సక్సెస్ అయ్యాడు.
తన ప్రతిభను చూపించాలనే ఉద్దేశంతో యూట్యూబ్లో ఇంటర్వ్యూలు చేయడం మొదలు పెట్టాడు శివ.అలా బుల్లి తెర ద్వారా ప్రేక్షకులకు దగ్గరైన శివ ఇప్పుడు బిగ్బాస్ ద్వారా మరింత చేరువయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు.ఇన్నాళ్లు ఒక వర్గం ప్రేక్షకులకు మాత్రమే శివ తెలుసు.కానీ బిగ్ బాస్ లో ఎంట్రీ ఇచ్చిన తర్వాత చాలా మందికి ఆయన గురించి తెలిసి పోయింది.
శివ హౌస్ లో ఎంట్రీ ఇచ్చిన సమయంలో చాలా క్యూట్ గా అనిపించాడు.అయితే అతని అల్లరి పనులు కొన్ని సార్లు విమర్శలు కూడా వచ్చాయి.అషు రెడ్డి మరియు సరయు లతో అతను మాట్లాడిన మాటలు కొన్ని శ్రుతి మించాయి అంటూ విమర్శలు వ్యక్త మవుతున్నాయి.ఇదే సమయంలో అతడు బిందు మాధవి తో చేసే సరదా పనులు ఆమెతో మాట్లాడే ముచ్చట్లు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

మొత్తానికి యాంకర్ శివ మెల్ల మెల్లగా జనాల్లోకి వెళ్తున్నాడు అనుకుంటున్న సమయం లో పిండి పిసికే విషయంలో వివాదం ఎదుర్కొంటు న్నాడు.తాజా ఎపిసోడ్ లో నాగార్జున ఆ విషయమై చాలా సీరియస్ గా వార్నింగ్ ఇచ్చాడు.డబల్ మీనింగ్ డైలాగులతో ఆడవారిని కించపరిచే విధంగా మాట్లాడటం తో ఒక్కసారిగా శివ గ్రాఫ్ తగ్గిపోయింది.మళ్లీ ఆ స్థాయిలో గ్రాఫ్ తెచ్చుకోవాలంటే శివ చాలా కష్టపడాల్సి ఉంది.
ఈ లోపు శివ నామినేషన్ లోకి వస్తే ఎలిమినేషన్ అయినా ఆశ్చర్యం లేదు.అందుకే బిగ్బాస్ నాన్ స్టాప్ లో శివ జర్నీ ఎలా ఉంటుంది అనేది ఇప్పుడే చెప్పలేమని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.







