తెలుగు సినీ నటుడు, కమెడియన్ ధనరాజ్ పరిచయం గురించి తెలుగు ప్రేక్షకులకులందరికీ తెలిసిందే.జబర్దస్త్ లో కమెడియన్ గా అడుగు పెట్టి మంచి పేరు సంపాదించుకున్నాడు.
తన కామెడీతో మంచి అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు.అలా వెండి తెరపైనే కాకుండా బుల్లితెరపై కూడా తనకంటూ ఓ గుర్తింపును సొంతం చేసుకున్నాడు ధన్ రాజ్.
ఇక ఈయన 2004లో జై సినిమాతో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమయ్యాడు.ఆ తర్వాత పిల్లజమీందార్, భీమిలి కబడ్డీ జట్టు వంటి పలు సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.
అలా దాదాపు 75 పైగా సినిమాలలో నటించాడు ధన్ రాజ్.కేవలం నటుడుగా, కమెడియన్ గానే కాకుండా నిర్మాతగా కూడా మారి ధనలక్ష్మి తలుపు తడితే అనే సినిమాను నిర్మించాడు.

కానీ నిర్మాతగా ధన్ రాజ్ కు కలిసి రాలేదు.చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు.నిజానికి ధన్ రాజ్ ఈ సినిమా కంటే ముందు మరో సినిమాకు హీరోగా చేస్తూ ఉండగా నిర్మాత సమస్యలతో ఆ సినిమాను ఆపివేశాడు.నిజానికి ఆ సినిమా కోసం నిర్మాత కూడా ముందుకు రాలేదు.
దాంతో ధన్ రాజ్ తానే స్వయంగా నిర్మాతగా మారి ధనలక్ష్మి తలుపు తడితే అనే సినిమాను నిర్మించాడు.

కానీ ఈ సినిమా ధన్ రాజ్ నిరాశ పరిచింది.నిజానికి ఆ సమయంలో ధన్ రాజ్ కు బాగా ఎదురు దెబ్బ తగిలింది అని చెప్పవచ్చు.ఇదిలా ఉంటే తాజాగా ఈ విషయం గురించి మళ్లీ గుర్తు చేసి బాధపెడుతున్నట్లు కనిపించింది.
ప్రస్తుతం స్టార్ మా లో కామెడీ స్టార్ ధమాకా ప్రసారం అవుతున్న సంగతి తెలిసిందే.తాజాగా ఈ షో కు సంబంధించిన ప్రోమో విడుదలైంది.
అందులో స్పెషల్ ఎట్రాక్షన్ గా నాగబాబు ఎంట్రీ ఇచ్చాడు.ఎంట్రీ తోనే కమెడియన్స్ అందరికీ చుక్కలు చూపించాడు నాగబాబు.
చేతిలో కత్తి పట్టుకుని మరి కమెడియన్స్ అందరికీ వాతలు పెట్టాడు.నాగబాబు పక్కనే ఉన్న శేఖర్ మాస్టర్ కూడా బాగా ఆట పట్టించాడు.
ఇక నాగబాబు ఒక్కొక్కరి గురించి ఇంకొకరికి చెబుతూ తెగ సందడి చేశాడు.

ఇక ధన్ రాజ్ ను నాగబాబు పట్టుకొని ఉండగా శేఖర్ మాస్టర్ కొత్తబోతుంటే ధన్ రాజ్ వణికిపోతూ కనిపించాడు.వెంటనే కిరాక్ ఆర్పీ ధనలక్ష్మి తలుపు తడితే దెబ్బ కంటే ఈ దెబ్బ ఎక్కువేం కాదు అంటూ రివర్స్ కౌంటర్ వేసాడు.దీంతో ధన్ రాజ్ తో పాటు అక్కడున్న కమెడియన్స్ అంతా తెగ నవ్వుకున్నారు.
ఇక ఈ వీడియోను చూసిన కొందరు నెటిజన్లు ధన్ రాజుకు కావాలని ఈ విషయం గుర్తు చేసి మరీ బాధ పెడుతున్నారు అని కామెంట్లు పెడుతున్నారు.ఇక ఈ షో ఆదివారం రోజు మధ్యాహ్నం 12 గంటలకు స్టార్ మా లో ప్రసారం కానుంది.







