న్యూస్ పేపర్ కొంతకాలానికి పసుపు రంగులోకి ఎందుకు మారుతుందో తెలుసా?

మీరు ప్రతిరోజూ వార్తాపత్రికలను చూస్తూ ఉంటారు.అయితే మీరు ఉదయం పూట వార్తాపత్రికను తీసుకున్నప్పుడు అది తెల్లగా కనిపిండాన్ని మీరు గమనించే ఉంటారు.

 Do You Know Why The Newspaper Turns Yellow For A While, Earthsky, Lignin Cells,-TeluguStop.com

అయితే రోజులు గడిచేకొద్దీ.ఆ కాగితం రంగు పసుపు రంగులోకి మారుతుంది.

ఇది వార్తాపత్రికలలో మాత్రమే కాదు, పుస్తకాల విషయంలో కూడా జరుగుతుంది.నెలలు, సంవత్సరాలు గడిచేకొద్దీ, వాటి రంగు కూడా పసుపు రంగులోకి మారుతుంది.

ఇలా ఎందుకు జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.ఎర్త్‌స్కీ నివేదిక ప్రకారం కాగితం అనేది కలపతో తయారవుతుంది.

కలపలో రెండు రకాల మూలకాలు ఉన్నాయి.అవి.సెల్యులోజ్ మరియు లిగ్నిన్.ఇవి రెండూ కాగితాన్ని ప్రభావితం చేస్తాయి.

ఫలితంగా కాగితం రంగు మారుతుంది.ఇది ఎలా జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.కాగితంలో ఉండే లిగ్నిన్ కణాలు..

గాలి, సూర్యకాంతిని తాకినప్పుడు ప్రతిస్పందిస్తాయి.దీనినే ఆక్సీకరణం అంటారు.

ఈ సమయంలో, లిగ్నిన్ కణాలు పెద్ద పరిమాణంలో సూర్య కిరణాలను గ్రహిస్తాయి.అవి కిరణాలకు ఎంతో ప్రభావితమవుతాయి.

అప్పుడు కాగితం రంగు ముదురుగా మారుతుంది.ఒక నివేదిక ప్రకారం ఇంట్లో ఉంచిన వార్తాపత్రికలు కొంతకాలానికి పసుపు లేదా గోధుమ రంగులో కనిపించడానికి కారణం ఇదే! మరికొన్ని రకాల పేపర్లు అంత త్వరగా రంగు మారవని నిపుణులు చెబుతున్నారు.

దీనికి ఒక కారణం కూడా ఉంది.ఖరీదైన కాగితాలలో ఇది చాలా నెమ్మదిగా జరుగుతుంది.

ఎందుకంటే పేపర్ తయారైన తరువాత ఆ కాగితం నుంచి లిగ్నిన్ తొలగిస్తారు.కాగితంలో లిగ్నిన్ లేనట్లయితే సూర్యకాంతి కారణంగా ఎటువంటి ప్రతిచర్య జరగదు.

ఫలితంగా ఆ కాగితం పసుపు రంగులోకి మారదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube