యాంకర్ : శ్రీశైలం భ్రమరాంబా సమేత మల్లికార్జునస్వామి వారిని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సిజె ఎన్ వి రమణ దంపతులు దర్శించుకున్నారు ఆలయ రాజగోపురం వద్దకు చేరుకున్న సిజె రమణ దంపతులకు జిల్లా జడ్జీ కృపాసాగర్ కర్నూలు కలెక్టర్ కోటేశ్వరరావు దేవాదాయశాఖ కమీషనర్ హరిజవహర్ లాల్ ఈఓ లవన్న అర్చకులు వేదపండితులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు అర్చక స్వాములు సిజె రమణకు నుదిటిన వీభూది తిలకం దిద్దగా అధికారులు పూలమాలతో స్వాగతం పలికారు అనంతరం సిజె రమణ దంపతులు ఆలయం ముందుబాగంలోని ద్వజస్దంభానికి నమస్కరించుకుని శ్రీ భ్రమరాంబా సమేత మల్లికార్జునస్వామి వారిని దర్శించుకున్నారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత శ్రీశైలం ఆలయానికి రావడం ఇది రెండవసారి శ్రీశైలం భ్రమరాంబా సమేత మల్లికార్జునస్వామి వారిని దర్ధించుకున్నారు రాత్రి శ్రీశైలంలో బసచేచేసి రేపు ఉదయం ఆలయం ముందుబాగంలో ఉన్న కంచి మఠం నందు పూర్ణాహుతి పూజలలో సిజె రమణ దంపతులు పాల్గోననున్నారు.







