సుదీర్ఘమైన కెరీర్ కోసం క్రికెటర్లకు ఫిట్‌నెస్ చాలా అవసరం.ఫిట్‌నెస్ లేక, గాయాల బెడదతో చాలా మంది ప్రతిభావంతులైన క్రికెటర్లకు కెరీర్‌కు వీడ్కోలు పలికారు.
టీమిండియాలో ఫిట్‌నెస్‌కు ప్రత్యామ్నాయంగా కోహ్లిని అందరూ చూపిస్తుంటారు.తాజాగా ఫిట్‌నెస్ అందరికీ తప్పని సరి అంటూ బీసీసీఐ కీలక ఆదేశాలు జారీ చేసింది.
ఓ రకంగా చెప్పాలంటే ఇది హెచ్చరికగానే భావించాలి.

బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ ఉంది.ఇందులో బీసీసీఐ నుంచి కాంట్రాక్టు పొందిన ఆటగాళ్లంతా త్వరలో ఫిట్‌నెస్ టెస్టు పాస్ అవ్వాల్సి ఉంది.లేకుంటే ఐపీఎల్‌లో కూడా వారిని ఆడనివ్వబోమని బీసీసీఐ హెచ్చరించింది.
ఈ నెల 25 నుంచి ఐపీఎల్ ప్రారంభం అవుతోంది.ఈ ఏడాదిలోనే టీ20 ప్రపంచకప్ కూడా ఉంది.
వరుస టోర్నీలతో బిజీగా ఉండే టీమిండియా క్రికెటర్ల ఆరోగ్యం, ఫిట్‌నెస్ వంటి అంశాలపై బీసీసీఐ సీరియస్‌గా దృష్టిసారించింది.ఈ క్రమంలో ఐపీఎల్‌కు ముందుగానే ఎన్‌సీఏలో ఫిట్‌నెస్ టెస్టును పాస్ అవ్వాల్సి ఉంటుందని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
తాము ఎన్‌సీఏ శిబిరంలో ఉంటే ఐపీఎల్ ఫ్రాంచైజీల నుంచి అభ్యంతరాలుంటాయని కొందరు క్రికెటర్లు బోర్డుకు తెలిపారు.ఆ కామెంట్లకు బీసీసీఐ కార్యదర్శి జై షా ఘాటుగా సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది.
క్రికెటర్లకు జాతీయ జట్టు కంటే ఏదీ ఎక్కువ కాకూడదని చెప్పినట్లు సమాచారం.దీంతో బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టు పొందిన ఆటగాళ్లంతా విధిగా ఎన్‌సీఏ ఫిట్‌నెస్ శిబిరానికి వెళ్లనున్నారు.
ఒక వేళ ఇందులో ఎవరైనా గాయపడినట్లు తేలినా, ఫిట్‌నెస్ లేదని తెలిసినా వారు ఐపీఎల్‌కు సైతం దూరమయ్యే అవకాశం ఉంది.







