ఈ మధ్యకాలంలో వాహన ప్రమాదాల వల్ల ఎంతో మంది మరణిస్తున్నారు.సామాన్యుడి నుంచి సెలబ్రిటీల వరకు ఎంతోమంది ఈ ప్రమాదాల వల్ల మరణిస్తున్నారు.
రోడ్డు ప్రమాదాల కారణంగా ఇప్పటికే ఎంత మంది సెలబ్రెటీలు చనిపోయిన విషయం తెలిసిందే.ఇంకొందరు సెలబ్రెటీలు చావు అంచులు వరకు వెళ్లి అదృష్టవశాత్తు బయటపడ్డారు.
ఇండస్ట్రీలో చాలా మందికి డ్రైవింగ్ అన్న, లాంగ్ డ్రైవింగ్ అన్న చాలా ఇష్టం.అలాంటి వారిలో తమిళ బిగ్ బాస్ కంటెస్టెంట్ అయినా యషికా ఆనంద్ కూడా ఒకరు.
ఈమెకు డ్రైవింగ్ అంటే చాలా ఇష్టం.కానీ అలాంటి యషికా ఈ జన్మలో తాను డ్రైవింగ్ జోలికి వెళ్లను అంటోంది.
మరి ఆమె అలా ఎందుకు అంటుంది.అలా అనడానికి గల కారణాలు ఏమిటి? గురించి తెలుసుకుందాం.తమిళ బిగ్ బాస్ కంటెస్టెంట్, నోటా హీరోయిన్ అయిన యషికా అలాంటి నిర్ణయం తీసుకోవడానికి బలమైన కారణమే ఉంది అని అంటోంది.గత ఏడాది యషికా, ఆమె స్నేహితురాలు కలసి ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురయ్యింది.
ఇక ఆ ప్రమాదంలో యషికా స్నేహితురాలు భవాని అక్కడికక్కడే మరణించింది.కాగా యషికా తీవ్రగాయాలతో అదృష్టవశాత్తూ బయటపడింది.
ఆ సంఘటన తరువాత యషికా కొంత కాలం పాటు పూర్తిగా మంచానికి పరిమితం అయింది.ఇక ప్రస్తుతం యషికా కోలుకుంది.

తాజాగా ఆమె ఇంస్టాగ్రామ్ లో తన అభిమానులతో చిట్ చాట్ చేసింది.ఈ సందర్భంగా ఒక నెటిజెన్ నీలిరంగు రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్ నీదేనా? ఇప్పటికీ నువ్వు దాన్ని వాడుతున్నావా అని ప్రశ్నించగా.ఆ విషయంపై స్పందించిన యషికా అది నాదే కానీ ఆ బైక్ ను నా సోదరుడు వాడుతున్నారు.ఎందుకంటే నేను డ్రైవింగ్ కి గుడ్ బై చెప్పారు అని సమాధానం ఇచ్చింది యషికా.
దీనితో షాక్ అయిన అభిమానులు ఒకరు ఎందుకు డ్రైవింగ్ మానేశారు? డ్రైవింగ్ అంటే మీకు చాలా ఇష్టం కదా అని అడగగా.అప్పుడు ఆమె అవును.
కానీ నా స్నేహితురాలిని నేనే చంపానని చాలామంది పదేపదే అంటున్నారు.అందువల్ల మంచి కోసమే డ్రైవింగ్ మానేశాను అని చెప్పుకొచ్చింది.
ఇంతలో మరొక నెటిజెన్ మీ బెస్ట్ ఫ్రెండ్ ఎలా చనిపోయింది అని అడగగా.నేను ఫాస్ట్ గా డ్రైవింగ్ చేయడం వల్ల అంటూ బాధ గా రిప్లై ఇచ్చింది యషికా.







