పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సినిమాతో మరొకసారి వెండి తెరపై కనిపించి ప్రేక్షకులను అలరించాడు.ఈ సినిమా ఇచ్చిన ఫుల్ జోష్ తో వరుస సినిమాలు చేస్తూ క్షణం కూడా తీరిక లేకుండా బిజీగా గడుపు తున్నాడు.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ మూడు సినిమాలతో బిజీగా ఉన్నాడు.అందులో ‘హరి హర వీరమల్లు‘ సినిమా ఒకటి.
ఈ సినిమా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతుంది.
మొగల్ చక్రవర్తి పాలనా కాలానికి సంబంధించిన కథ ఇది.ఇప్పటికే ఈ సినిమా నుండి వచ్చిన ఫస్ట్ లుక్ తోనే మంచి మార్కులు కొట్టేసారు.ఇది మొగల్ చక్రవర్తుల కాలం నాటి సినిమా కావడంతో ఈ సినిమా కోసం భారీ సెటింగ్స్ వేసి మరి తెరకెక్కిస్తున్నారు.
ఇప్పటికే ఈ సినిమా 50 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది.కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఆగిన షూటింగ్ ఇప్పటి వరకు జరగలేదు.
అయితే ఇప్పుడు మిగతా షూట్ స్టార్ట్ కాబోతున్నట్టు తెలుస్తుంది.దీంతో ఈయన మళ్ళీ ఈ లుక్ లోకి మారిపోయాడు.
షూట్ ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న నేపథ్యంలో ఈ సినిమాపై లేటెస్ట్ అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది.తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా ఏప్రిల్ మొదటి వారం నుండి స్టార్ట్ కాబోతున్నట్టు సినీ వర్గాల నుండి సమాచారం అందుతుంది.
ఈ యాక్షన్ ఎపిసోడ్ ఈ సినిమాకే హైలెట్ గా నిలిచేలా క్రిష్ డిజైన్ చేసినట్టు చెబుతున్నారు.

ఇప్పటికే భారీ సెట్టింగ్స్ ని మళ్ళీ స్టార్ట్ చేసారు.అలాగే ఈ షూటింగ్ ను సాలిడ్ యాక్షన్ సీక్వెన్స్ తో స్టార్ట్ చేస్తున్నారని కూడా వార్తలు వస్తున్నాయి.ఈ సినిమాలో అర్జున్ రామ్ పాల్, జాక్వెలిన్ ఫెర్నాడస్ కూడా నటిస్తున్నారు.
ఇక ఈ సినిమాకి ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా.ఏ ఎం రత్నం ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.
ఇందులో నిధి అగర్వాల్ పవన్ కు జోడీగా నటిస్తుంది.ఈ సినిమాను క్రిష్ వచ్చే నెల ఏప్రిల్ 29న విడుదల చేస్తాం అని ఎప్పుడో ప్రకటించాడు.







