వెస్టిండీస్ మాజీ క్రికెటర్ డ్వేన్ బ్రావో చాలా యాక్టివ్ గా ఉంటాడు.మైదానంలో అతను చూపించే ఎనర్జీకి ఎవరైనా సరే ఫిదా అవ్వాల్సిందే.
అయితే ఈ మధ్య అతడు తరచుగా భారతీయ పాటలకు స్టెప్పులు వేస్తూ అదరగొడుతున్నాడు.దీనికి సంబంధించిన వీడియోలు తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకుంటున్నాడు.
తాజాగా అతడు మరో ఇండియన్ సాంగ్‌కు అదిరిపోయే స్టెప్పులు వేశాడు.ఈ వీడియో ఇప్పుడు సోషల్ మాధ్యమాల్లో వైరల్ గా మారింది.
వైరల్ అవుతున్న వీడియోలో బ్రావో నోరా ఫతేహి నర్తించిన “డ్యాన్స్ మేరీ రాణి” అనే పాటకు డ్యాన్స్ చేయడం చూడొచ్చు.అతడు తన స్నేహితురాలు అనా తో కలిసి స్టెప్పులు వేశాడు.
వీరిద్దరూ కూడా చాలా చక్కగా డాన్స్ చేస్తూ తెగ ఎంజాయ్ చేశారు.ఈ పాపులర్ సాంగ్ లోని హుక్ స్టెప్స్ కూడా వేస్తూ కేక పుట్టించారు.ఈ వీడియోకి ఇప్పటికే దాదాపు నాలుగు లక్షల వరకు లైకులు వచ్చాయి.“డ్యాన్స్ మేరీ రాణి పాటకు నా డీజే ఫ్రెండ్ అనా తో కలిసి నాట్యం చేస్తూ ఎంజాయ్ చేస్తున్నాను” అని అతడు ఈ వీడియో పోస్ట్ కి ఒక క్యాప్టెన్ జోడించాడు.ఈ వీడియోకి 2 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి.క్రికెట్ అభిమానులు దీనిపై వేలకొద్ది కామెంట్లు చేస్తున్నారు. క్రికెట్ లో మాత్రమే కాదు డాన్స్ లోనూ బ్రావో ఛాంపియన్ అని ఒక నెటిజన్ కామెంట్ చేశాడు.బ్రావో తన డ్యాన్స్ తో అభిమానులను ఎంటర్టైన్ చేయడం కొత్తేమీ కాదు.2016 లో ఛాంపియన్ అనే పాటతో అతడు యావత్ ప్రపంచాన్ని ఉర్రూతలూగించాడు.38 ఏళ్ల వయసులోనూ ఇప్పటికీ కుర్రాడిలా అతడు సూపర్ ఎనర్జీతో కనిపిస్తున్నాడు.ఈ వీడియోని మీరు కూడా చూసేయండి.







