తెలంగాణ రాష్ట్రంలో గత ఎన్నకలకు ముందుగా సీఎం కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లిన విషయం విధితమే.ప్రస్తుతం ఇదే తరహాలో ఏపీ సీఎం జగన్ కూడా ముందస్తు ఎన్నికలకు వెళ్తారనే టాక్ వినిపిస్తోంది.
ఈ క్రమంలో వైసీపీ కీక నేత, ప్రభుత్వ సలహాదారు సజ్జల్ రామకృష్ణారెడ్డి పలు కీలక వ్యాఖ్యలు చేశారు.ఏపీలో ముందస్తు ఎన్నికల ప్రచారం అనేది అంతా అవాస్తవం అని తేల్చి చెప్పారు.
వైసీపీ 12వ వార్షికోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొని ఈవిధంగా స్పందించారు.వైసీపీ పార్టీ రాజకీయాల్లో అనేక నూతన సంస్కరణలు తీసుకొచ్చిందని, ప్రజలకు సేవలందించడమే పార్టీ లక్ష్యం అంటూ చెప్పుకొచ్చారు.
జగన్ వేసిన నవరత్నాల విత్తనాలు నేడి వృక్షాలుగా మారి సతఫలితాలు ఇస్తున్నాయంటూ చెప్పారు.మూడేండ్లుగా ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని అన్నారు.
అన్ని వర్గాలకు రాజకీయ సాధికారిత కల్పించామని వెల్లడించారు.ఇక టీడీపీని కుప్పంతో సహా ఇతర ప్రాంతాల్లో క్లీన్ స్వీప్ చేశామని ఎద్దేవా చేశారు.2024 ఎన్నికల్లో 160 సీట్లు టీడీపీ సాధిస్తుందన్న ప్రచారం, అమరావతి గ్రాఫిక్స్ వంటిదని, అది చూసి జనాలు నవ్వుకుంటున్నారంటు కామెంట్లు చేశారు.ఇక 2024లో టీడీపీ సినిమాకు శుభం కార్డు పడుతుందని జోస్యం చెప్పారు.
వైసీపీ కార్యకర్తలంతా ప్రజలతో మమేకం కావాలని, టీడీపీ కుట్రలను ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేయాలని సూచించారు.ఎట్టి పరిస్తితుల్లోనూ 2024లో టీడీని భూస్థాపితం చేయాలని పిలుపునిచ్చారు.ఆ దిశగా వైసీపీ శ్రేణులు శక్తివంచన లేకుండా కృషి చేయాలని కోరారు.జులైలో వైసీపీ ప్లీనరి ఉంటుందని, ఇందుకు అన్ని ఏర్పాట్లు చేసుకోవాలంటూ దిశానిర్ధేషం చేశారు.
అయితే ఏపీలో మాత్రం ముందస్తు ఎన్నికలు ఉండవని, ప్రచారం అంతా బూటకమని తేల్చి చెప్పడం కొసమెరుపు.







