తెలంగాణ రాజకీయాలలో జరుగుతున్న కీలక పరిణామాలు దేశ రాజకీయాలని ఆకర్షిస్తున్న పరిస్థితి ఉంది.అయితే కేసీఆర్ ఇప్పటికే త్వరలో దేశ రాజకీయాలపై ఎక్కువగా దృష్టి సారించనున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో ఇప్పటికే పలు రాష్ట్రాల సీఎంలు, కీలక నేతలతో భేటీ అయిన విషయం తెలిసిందే.
అయితే ఎంత మేరకు వారి నుండి సానుకూల స్పందన వ్యక్తమయిందనే విషయంపై ఎవరికి స్పష్టత లేకున్నా రానున్న రోజుల్లో కెసీఆర్ ఏదైనా ఒక విలేఖరుల సమావేశంలో క్లారిటీ ఇస్తే కాని తెలిసే అవకాశం లేదు.అయితే కెసీఆర్ జాతీయ రాజకీయాలపై దృష్టి సారిస్తుండడంతో తెలంగాణలో రాజకీయ పరిస్థితులపై దృష్టి తగ్గిస్తుండటంతో ఇక్కడ పరిస్థితులు పూర్తిగా ప్రతిపక్షాల చేతుల్లోకి వెళ్తున్న పరిస్థితి ఉంది.
టీఆర్ఎస్ లో కెసీఆర్ మాట్లాడితే తప్ప వేరే ఇతర నాయకుడు ఎవరు మాట్లాడినా ప్రజల్లోకి వెళ్ళే పరిస్థితి కనిపించడం లేదు.

అంతేకాక తాజాగా వెల్లడైన ఫలితాలలో బీజేపీకి అనుకూలంగా ఫలితాలు రావడంతో కెసీఆర్ బీజేపీ వ్యతిరేక భావజాలం ఎంత మేరకు ప్రజల్లోకి వెళ్తుందనేది కొంత ఆశ్చర్యకమైన విషయం.అయితే రానున్న రోజుల్లో ఇక జాతీయ రాజకీయాలపై కెసీఆర్ దృష్టి తగ్గించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.ఎందుకంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో కెసీఆర్ కదన రంగంలోకి దూకితేనే ఎంతో కొంత టీఆర్ఎస్ అనుకూల పవనాలు వీచే అవకాశం ఉంది.
లేకపోతే కొంత ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుంది.అయితే ఇటీవల ప్రెస్ మీట్ తరువాత ఇంకా ఇతర నేతల సమావేశాలపై ఇంకా ఎటువంటి వివరాలు వెల్లడించని పరిస్థితుల్లో క్లారిటీ ఇస్తారా లేక ఇలాగే రాష్ట్ర రాజకీయాలపై దృష్టి సారిస్తారా అనేది తెలియాల్సి ఉంది.
వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలిస్తే ఇక రాష్ట్ర రాజకీయాలలో కీలక పరిణామాలు జరిగే అవకాశం ఉంది.







