బాలీవుడ్ హీరోయిన్, అలనాటి తార శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్ పరిచయం గురించి అందరికీ తెలిసిందే.ప్రస్తుతం బాలీవుడ్ లో ఈ ముద్దుగుమ్మ ఓ రేంజ్ లో దూసుకుపోతుంది.
అతి తక్కువ సమయంలో మంచి క్రేజ్ సంపాదించుకుంది.స్టార్ హోదా ను సొంతం చేసుకుంది.
ఇక తన అందాలతో మాత్రం గ్లామర్ విందునే వడ్డిస్తుంది జాన్వీ కపూర్.హాలీవుడ్ హీరోయిన్స్ లా గ్లామర్ షో చేస్తూ అందర్నీ షాక్ అయ్యేలా చేస్తుంది.
ఇదిలా ఉంటే తాజాగా తన సిస్టర్ తో కలిసి తెగ అల్లరి చేసింది.
బాలీవుడ్ ఇండస్ట్రీకి దడక్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఆ తర్వాత వరుస సినిమాలలో బాగా బిజీగా మారింది.
ఈ బ్యూటీ మొదట్లో ఎంతో పద్ధతిగా కనిపించగా రాను రాను గ్లామర్ షో తో బాగా రెచ్చిపోతుంది.గతంలో కొన్ని వ్యక్తిగత విషయాల పట్ల బాగా హాట్ టాపిక్ గా నిలిచింది.
ఆ తర్వాత సోషల్ మీడియాలో కూడా మరింత యాక్టివ్ గా ఉంటూ తన హాట్ ఫోటోలతో బాగా రచ్చ చేస్తుంది.ఇక సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా సంపాదించుకుంది.
నిత్యం ఫోటో షూట్ లతో సోషల్ మీడియాను బాగా షేక్ చేస్తుంది.ఇక తనకు సంబంధించిన విషయాలను, సినిమా అప్డేట్లను బాగా షేర్ చేసుకుంటుంది.
తన పొట్టి పొట్టి డ్రెస్సులతో బికినీ అందాలతో యువతను కన్నార్పకుండా చేస్తోంది.ఈమె షేర్ చేసే వీడియోలు కానీ, ఫోటోలు కానీ తెగ వైరల్ అవుతూ ఉంటాయి.
జాన్వీ కపూర్ చూడటానికి చాలా సైలెంట్ గా కనిపిస్తుంది.కానీ ఆమె చేసే అల్లరి మాత్రం బాగా వైలెంట్ గా ఉంటుంది.
ముఖ్యంగా తన సోదరి ఖుషి కపూర్ తో చేసే అల్లరి అంతా ఇంతా కాదు.ఖుషి కపూర్ కూడా సినీ ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది.
ఇక ఈమె సోషల్ మీడియా ఖాతాలలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది.తన అక్క మాదిరిగా హాట్ లుక్ లతో బాగా రచ్చ రచ్చ చేస్తుంది.
ఇక ఇదంతా పక్కన పెడితే తాజాగా ఈ ఇద్దరు అక్క చెల్లెలు ఎయిర్ పోర్ట్ లో తెగ అల్లరి చేశారు.

పైగా తాము అల్లరి చేసిన వీడియో నెట్టింట్లో తెగ వైరల్ గా మారింది.ఇంతకు ఆ వీడియోలో ఏముందంటే.జాన్వీ కపూర్ లగేజ్ బ్యాగ్ పై కూర్చొని ఉండగా తనను వెనకాల నుంచి మరో అమ్మాయి తోస్తున్నట్లుగా కనిపించింది.
ఇక ఖుషి కపూర్ ఆ వీడియోని రికార్డ్ చేస్తున్నట్లు అనిపించగా జాన్వీ కపూర్ చేసే అల్లరికి ఖుషి కపూర్ నవ్వుతున్నట్లుగా అనిపించింది.మొత్తానికి ఈ వీడియో బాగా లైక్ లను, వ్యూస్ ను సంపాదించుకుంది.
ఇక జాన్వీకపూర్ ప్రస్తుతం పలు ప్రాజెక్టుల లో బిజీగా ఉన్నట్లు తెలుస్తుంది.







