రీసెంట్ గా వచ్చిన ప్రభాస్ రాధే శ్యామ్ మిశ్రమ స్పందన తెచ్చుకుంది.ఈ సినిమా విషయంలో అభిమానుల అంచనాలు రీచ్ కాలేదు.
సినిమాలో ప్రభాస్, పూజా హెగ్దే ల జోడీ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది.జిల్ ఫేమ్ రాధాకృష్ణ డైరక్షన్ లో తెరకెక్కిన రాధే శ్యామ్ సినిమా వసూళ్ల పరంగా అదరగొడుతుంది.
ఇదిలాఉంటే ఈ సినిమా కోసం ప్రభాస్ దాదాపు నాలుగైదు కథలని రిజెక్ట్ చేశాడని తెలుస్తుంది.సాహో సినిమా టైం లోనే రాధే శ్యామ్ సినిమా కథ తన దగ్గరకు రాగా అదే టైం లో మరో మూడు కమర్షియల్ సినిమాలు మరో ఫ్యామిలీ ఎంటర్టైనర్ కథ ప్రభాస్ దగ్గరకు వచ్చిందట.
అయితే కమర్షియల్ సినిమాలు తీసి బోర్ కొట్టిన ప్రభాస్ ఓ ప్రేమకథ చేయాలని అనుకుని రాధే శ్యామ్ తీశాడట.ఈ సినిమాకు బదులుగా ఐదు సినిమాలని కాదని చెప్పాడట ప్రభాస్.
ఓ విధంగా ప్రభాస్ తీసుకున్న ఈ నిర్ణయం ఫ్యాన్స్ ని డిజప్పాయింట్ చేసిందని చెప్పొచ్చు.రాధే శ్యామ్ తో అంచనాలను అందుకోని ప్రభాస్ సలార్ తో అయినా ఆ రేంజ్ హిట్ అందుకోవాలని ఆశిస్తున్నారు.







