టాలీవుడ్ హీరో మెగాస్టార్ చిరంజీవి గురించి మనకు తెలిసింది.చిరంజీవి రీల్ లైఫ్ లోనే కాకుండా రియల్ లైఫ్ లో కూడా ఎంతోమందికి సహాయం చేసి రియల్ లైఫ్ లో కూడా హీరో అనిపించుకున్నారు.
చిరంజీవి మనకు కూడా ఎంత గొప్పదో తెలిసిందే. చిరంజీవి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎంతో మందికి సహాయం చేశారు.
అలా ఎంతో మంది ఆపదలో ఉన్న వారిని ఆదుకొని వారి పాలిట దేవుడు లా నిలిచారు చిరంజీవి.కానీ హీరోగా,ఒక మంచి వ్యక్తిగా నిలదొక్కుకోవడానికి తన భార్య సురేఖనే కారణం అని అంటున్నారు మెగాస్టార్ చిరంజీవి.

తాజాగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సురేఖ గొప్పతనం గురించి చెప్పుకొచ్చారు.ఆ తర్వాత తనకు కోకాపేటలో ఎకరాల స్థలం ఉందని, అక్కడ ఒక ఫామ్ హౌస్ కూడా కట్టుకొని పొలం పనులు కూడా చేద్దామని అనుకున్నానని, ప్రస్తుతం మా భూమి ధర కోట్లు పలుకుతోంది అని తెలిపారు చిరంజీవి.అసలు విషయంలోకి వెళ్తే.చిరంజీవి తన చెల్లెళ్ల కోసం ఇల్లు కట్టించారట.వారి బిడ్డల భవిష్యత్తు చూసుకుంటున్నారట.వారు కూడా మంచి స్థాయికి ఎదిగారని, ఇప్పుడు వారు మంచి స్థానంలో ఉన్నారు అని చెప్పుకొచ్చారు చిరంజీవి.
కోకాపేట లో ఉన్న స్థలం ధర ప్రస్తుతం ఎలాగో కోట్ల రూపాయలు పెరిగింది కదా అందులో కొంత మీ చెల్లెలు కి ఇస్తే బాగుంటుంది కదా అని సురేఖ చిరంజీవికి తెలిపిందట.
అయితే ఏ మహిళ కూడా ఆడపడుచులకు అంత ఆస్తి ఇవ్వాలి అని అనుకోదని కానీ సురేఖ ఆ భూమిని చిరంజీవి చెల్లెళ్లకు ఇస్తే భవిష్యత్తులో వారికి ఆసరాగా ఉంటుంది అని తెలిపిందట.
అప్పుడు చిరంజీవి సురేఖ ను మంచి సలహా ఇచ్చావు అని అన్నారట.ఆ తర్వాత చిరంజీవి తన సినిమాల పరంగా బిజీగా ఉండటంతో ఆ విషయాన్ని మర్చిపోయారట.
కానీ రాఖీ పండుగ కొన్ని రోజుల ముందు మరొకసారి సురేఖ అదే విషయాన్ని చిరంజీవి గుర్తు చేసిందట.రెండు ఎకరాల భూమిని వారికి బహుమతిగా ఇవ్వండి అని చెప్పి ఆ తర్వాత పనులు కూడా తానే పూర్తి చేసిందట సురేఖ.
రాఖీ పండుగ రోజు స్థలం డాక్యుమెంట్స్ చూసి చిరంజీవి చెల్లెళ్లు షాక్ అవ్వడంతో పాటు సురేఖ ఫై ప్రశంసలు కురిపించారు అని చిరంజీవి తన భార్య సురేఖ గురించి గొప్పగా చెప్పుకొచ్చారు.







