రాధేశ్యామ్‌ అప్‌డేట్ : అక్కడ ఇక్కడ క్లైమాక్స్ వేరు వేరుగా ఉందా?

ప్రభాస్ అభిమానులు, తెలుగు సినిమా ప్రేక్షకులు మాత్రమే కాకుండా మొత్తం భారత దేశ సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన చిత్రం రాధేశ్యాం. ఈ సినిమా షూటింగ్ పూర్తయిన అప్పటి నుంచి ఎప్పుడు విడుదల అవుతుందా అంటూ అంతా ఆసక్తిగా చూశారు.

 Prabhas Pooja Hegde Radheshyam Hindi Talk Details, Prabhas, Pooja Hegde, Radhe S-TeluguStop.com

దాదాపు మూడు సంవత్సరాలుగా ఈ సినిమా గురించిన చర్చ జరుగుతోంది.దేశ వ్యాప్తంగా బాహుబలి మరియు సాహో సినిమాలతో ప్రభాస్ కి పాన్ ఇండియా సూపర్ స్టార్ హోదా దక్కింది.

దాంతో ఈ సినిమా ఖచ్చితంగా భారీ వసూళ్లను సాధిస్తుందనే నమ్మకం మొదటి నుంచి ప్రేక్షకుల్లో ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన రాధేశ్యామ్ సినిమా సౌత్ వర్షన్ వేరుగా.

నార్త్ వర్షన్ వేరుగా ఉంది అంటూ వార్తలు వస్తున్నాయి.తెలుగు వర్షన్ లో క్లైమాక్స్ ఇక్కడి ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా ఉంటే నార్త్‌ వర్షన్‌ లో మాత్రం యాంటీ క్లైమాక్స్ లో దర్శకుడు రాధాకృష్ణ ప్లాన్ చేశాడు అనే వార్తలు వస్తున్నాయి.

భారీ అంచనాలున్న ఈ సినిమా కథకు యాంటీ క్లైమాక్స్ అయితేనే సెట్ అవుతుంది అంటూ మేకర్స్ భావిస్తున్నారు.

Telugu Radha Krishna, Pan India, Pooja Hegde, Prabhas, Radheshyam-Movie

తెలుగులో వీక్ క్లైమాక్స్ అంటూ రివ్యూ లు వస్తున్న ఈ సమయంలో హిందీ లో క్లైమాక్స్ ఎలా ఉందా అంటూ నార్త్‌ ప్రేక్షకులు ఆసక్తిగా చూస్తున్నారు.తెలుగు లో కంటే ఈ సినిమా హిందీ లో ఎక్కువగా ఆడే అవకాశం ఉందంటూ టాక్ వినిపిస్తుంది.ప్రభాస్ మరియు పూజా హెగ్డే ల కాంబో సన్నివేశాల గురించి కాస్త నెగటివ్‌ చర్చ జరుగుతోంది.

హిందీ లో మాత్రం రొమాంటిక్ సన్నివేశాలు పీక్స్ లో ఉంటాయనే వార్తలు వస్తున్నాయి. మరి ఈ సినిమా కలెక్షన్లు ఎలా ఉంటాయో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube