నిన్న దేశంలోని ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడిన సంగతి తెలిసిందే.ఎన్నికల ఫలితాలలో పంజాబ్ రాష్ట్రంలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభంజనం సృష్టించడం గమనార్హం.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా పంజాబ్ ఫలితాల గురించి జోరుగా చర్చ జరుగుతోంది.పంజాబ్ సిట్టింగ్ సీఎం చరణ్ జీత్ చన్నీ రెండు స్థానాలలో పోటీ చేయగా ఆయన రెండు స్థానాలలో ఓటమిపాలు కావడం గమనార్హం.
పంజాబ్ ఎన్నికల్లో రాజకీయ దిగ్గజాలు సైతం ఓటమిపాలు కావడంతో రాజకీయ విశ్లేషకులు సైతం అవాక్కయ్యారు.సీఎం చన్నీపై బదౌర్ నియోజకవర్గంలో ఆప్ అభ్యర్థి అయిన లాభ్ సింగ్ పోటీ చేసి ఘన విజయాన్ని సొంతం చేసుకున్నారు.
ప్రస్తుతం లాభ్ సింగ్ పేరు పంజాబ్ అంతటా మారుమ్రోగుతోంది.అతి సామాన్యుడు అయిన లాభ్ సింగ్ సిట్టింగ్ సీఎంను ఓడించాడని తెలిసి ప్రజలు సైతం ఆశ్చర్యానికి గురవుతున్నారు.
లాభ్ సింగ్ గురించి తెలుసుకోవడానికి ప్రజలు సైతం చాలా ఆసక్తి చూపిస్తున్నారు.లాభ్ సింగ్ 1987 సంవత్సరంలో జన్మించగా ఇంటర్ వరకు చదువుకున్నారు.
లాభ్ సింగ్ తల్లి స్వీపర్ కాగా తండ్రి డ్రైవర్ కావడం గమనార్హం.దాదాపుగా పది సంవత్సరాల క్రితం లాభ్ సింగ్ ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు.
మొబైల్స్ రిపేర్ చేస్తూ లాభ్ సింగ్ ఇంతకాలం జీవనం సాగించడం గమనార్హం.

2017 సంవత్సరంలో కూడా ఈ నియోజకవర్గంలో ఆప్ గెలిచింది.ఆ సమయంలో ఆప్ నుంచి పిరమల్ సింగ్ గెలవగా ఆయన పార్టీ మారడంతో లాభ్ సింగ్ కు బదౌల్ నియోజకవర్గం టికెట్ లభించింది.బదౌల్ నియోజకవర్గంలో మొత్తం 74 గ్రామాలు ఉన్నాయి.
సామాన్యుడు అయిన లాభ్ సింగ్ అక్కడి ప్రజల సమస్యలన్నీ తనకు తెలుసని ఆ సమస్యలను కచ్చితంగా పరిష్కరిస్తానని హామీ ఇచ్చి ఓటర్ల మనస్సు గెలుచుకున్నారు.బదౌర్ నియోకవర్గం తన కుటుంబం అంటూ లాభ్ సింగ్ చేసిన కామెంట్లు ప్రజల్లో ఆయనపై అభిమానాన్ని పెంచాయి.
సీఎంనే ఓడించిన లాభ్ సింగ్ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తారేమో చూడాలి.







