ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి రాజకీయాలు ఎంత శ్రద్ధగా చేస్తున్నాడో.టాలీవుడ్ మీద కూడా తన ఫోకస్ అంతే శ్రద్ధగా పెట్టాడు.
ఆ విషయం టికెట్ రేట్లు పెంచిన సమయంలో నే అందరికి అర్ధం అయ్యింది.ఆయన చేసిన దాని ప్రకారం అందరికి అర్ధం అయ్యింది ఏంటి అంటే టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తాన్ని తన వైపుకు తిప్పుకోవడం.
ఈ విషయంలో ఆయన నూటికి నూరు శాతం సక్సెస్ సాధించాడని చెప్పాలి.
టికెట్ రేట్ల వ్యవహారంలో ఎన్నో చర్చల తర్వాత ఇటీవలే జగన్ ప్రభుత్వం సానుకూలంగా స్పందించిన విషయం తెలిసిందే.
ఈ మధ్యనే జగన్ తో సినీ పెద్దలు భేటీ అయిన విషయం తెలిసిందే.ఈ భేటీ అయిన తర్వాత జగన్ సానుకూలంగా స్పందించారని అందరు తెలిపారు.మరి ఈ భేటీకి వెళ్లిన సభ్యుల్లో ప్రభాస్ కూడా ఉన్న విషయం తెలిసిందే.

ఈ భేటీలో సినిమా టికెట్ ధరల పెంపు, ఇంకా ఐదవ షో కోసం సానుకూలంగా స్పంధించారు. రెమ్యునరేషన్ మినహా 100 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కే సినిమాలను ప్రత్యేకంగా చూస్తామని జగన్ తెలిపారు.అయితే ఈ భేటీ జరిగి చాలా రోజుల తర్వాత ఇటీవలే కొత్త జీవో రిలీజ్ చేసారు.
ఇందులో ఒక షరతు కూడా పెట్టింది.ఏపీలో కూడా 25 శాతం షూటింగ్ జరపాలని కండిషన్ పెట్టి మరి జీవో జారీ చేసిన విషయం తెలిసిందే.
ఏది జరిగిన ఎన్ని కండిషన్స్ పెట్టిన జీవో అయితేజారీ చేయడంతో ఆయనకు సినీ ప్రముఖులు ఎవరికీ వారు ధన్యవాదాలు తెలిపారు.అయితే ఇది ఇక్కడితో ఆపకుండా ఈయనకు సన్మానం చేయాలనీ అనుకుంటున్నారట.
ఎప్పుడు ఎక్కడ జరుగుతుందో తెలియదు కానీ అంతా అనుకుంటున్న మాట అయితే టాలీవుడ్ కి మేలు చేసిన ఆయనకు సన్మానం చేయాలని.

ఈ సన్మానం విషయం బయటకు రాగానే జనసేన పార్టీ నేతలు మాత్రం సీరియస్ అయ్యారు.అసలు ఆయనకు ఎందుకు సన్మానం చేయాలనీ నాదెండ్ల మనోహర్ పాయింట్ రెయిజ్ చేసారు.అటు వైపు మాత్రం సినీ ప్రముఖులు సన్మానం చేయడానికి సిద్ధంగా ఉన్నారని తెలుస్తుంది.
మరి నిజంగా సన్మానం జరిగి జగన్ ను పొగిడితే అప్పుడు పరిస్థితులు ఎలా మారుతాయో చూడాలి.







