దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఎన్నికలుగా భావించే యూపీ ఎన్నికలు అంతేకాక యూపీ అంత పెద్ద రాష్ట్రం కాకపోయినా ఎంతో కొంత ప్రాధాన్య రాష్ట్రాలలో ఎన్నికల ఫలితాలు ఎట్టకేలకు వెలువడ్డ పరిస్థితి ఉంది.ఇక యూపీ లో బీజేపీ బుల్డోజర్ వ్యూహం బీజేపీకి రెండో సారి భారీ విజయాన్ని కట్టబెట్టిన విషయం తెలిసిందే.
అయితే ఇక వచ్చే రెండున్నరేళ్లలో తెలంగాణలో కూడా ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్న కెసీఆర్ బీజేపీ వ్యతిరేక విధానాన్ని అవలంబిస్తున్న పరిస్థితుల్లో రానున్న రోజుల్లో ఎన్నికల సమయంలో రాజకీయం రణరంగంగా మారే అవకాశం ఉంది.అయితే బీజేపీని పెద్ద ఎత్తున విమర్శిస్తున్న కెసీఆర్ యూపీలో బీజేపీ గెలుపుతో కొంత జాగ్రత్తపడాల్సి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఎందుకంటే అతి పెద్ద రాష్ట్రంలో ప్రయోగించిన వ్యూహం తెలంగాణలో ఒక 50 శాతం విజయం సాధించినా ఎంతో కొంత బీజేపీ అనుకూల ఫలితాలు వచ్చే అవకాశం ఉంది.ఎందుకంటే రానున్న రోజుల్లో అభివృద్ధిని ప్రజలు పట్టించుకునే పరిస్థితి అయితే లేదు.
ఎందుకంటే సోషల్ మీడియా అనేది ప్రస్తుత రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న పరిస్థితుల్లో ఎంతో కొంత క్షేత్ర స్థాయి ప్రజలను ప్రతిపక్షాలు ప్రభావితం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

తద్వారా కెసీఆర్ చాలా రకాలుగా జాగ్రత్త పడడమే కాకుండా సోషల్ మీడియాలో కూడా ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టకలిగితేనే ఎంతో కొంత టీఆర్ఎస్ అనుకూల పవనాలు వీయడంతో పాటు ఎంతో కొంత ఆశాజనక ఫలితాలు అనేవి వచ్చే అవకాశం ఉంది.అయితే రాజకీయ దూరంధరుడైన కెసీఆర్ అంత సులభంగా బీజేపీకి గెలిచే అవకాశం ఇచ్చే పరిస్థితి లేదు.అయితే ఎంత మేరకు బీజేపీకి ధీటైన వ్యూహాలను కెసీఆర్ ప్రయోగిస్తారనేది రానున్న రోజుల్లో మనకు తెలిసే అవకాశం ఉంది.







