టాలీవుడ్ హీరో ప్రిన్స్ మహేష్ బాబు నటించిన అతిధి సినిమా గుర్తు ఉండే ఉంటుంది.ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన అమృత రావు కూడా మనందరికీ సుపరిచితమే.
ఈ బాలీవుడ్ బ్యూటీ అమృత రావు, ఆర్జె అన్మోల్ ను 2014లో రహస్య వివాహం చేసుకున్నారట.అయితే ఇదే విషయాన్ని ఈ సెలబ్రెటీ కపుల్ ఎక్కువ రోజులు దాచుకోలేక పోయారు.
తమ పెళ్లి విషయాన్ని తమ యూట్యూబ్ ఛానల్ ద్వారా వెల్లడించారు.అంతేకాకుండా పెళ్లి చేసుకుంటే కెరీర్ దెబ్బతింటుంది ఏమో అన్న ఉద్దేశంతో ఈ జంట పెళ్లి చేసుకోవడానికి మొదట్లో వెనకడుగు వేశారట.
ఇక కెరీర్ మంచి ఊపు మీద ఉన్న సమయంలో, సినిమా అవకాశాలు కూడా వరుసగా వస్తున్న సమయంలో అన్మోల్ పెళ్లి చేసుకుందామని ప్రపోజల్ పెట్టాడట.పెళ్లి చేసుకుంటే కెరీర్ ప్రభావితం అవుతుంది ఏమో అని భయపడిన అమృత కు అన్మోల్ ఒక ప్లాన్ చెప్పాడట.
రహస్య వివాహం చేసుకుందామని తెలిపారట.రహస్య వివాహం చేసుకుంటే ఇద్దరూ కలిసి ఉండవచ్చు, అదేవిధంగా కెరీర్ కు కూడా ఇలాంటి ఇబ్బంది ఉండదు అని అనడంతో ఆ పెళ్లికి అమృత సరే అందట.
అలా వారిద్దరూ గుట్టుచప్పుడు కాకుండా రహస్య వివాహం చేసుకున్నారు.

ఆ రహస్య వివాహం కావడంతో పెళ్లికి కనీసం కజీన్స్ ను కూడా పిలవలేదని చెప్పుకొచ్చింది అమృత.అలా ఈ జంట 2014 మే 15న రహస్య వివాహం చేసుకున్నారు.ఆ తర్వాత ఎక్కువ రోజులు దాచి ఉంచలేకపోయారు.
అందుకే వారిద్దరూ దంపతులు అన్న విషయాన్ని 2016లో అధికారికంగా ప్రకటించారు.ఇక అమృతారావు విషయానికి వస్తే మొదట బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ హీరోగా నటించిన ఇష్క్ విష్క్ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది.
ఆ తర్వాత వివాహ్, మస్తీ,ఇలాంటి సినిమాలలో నటించి అలరించింది.అంతేకాకుండా తెలుగు లో హీరో మహేష్ బాబు నటించిన అతిధి సినిమాలో కూడా నటించింది.







