మంచు ఫ్యామిలీ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఎక్కువగా నిలుస్తోంది.అంతేకాకుండా మంచు ఫ్యామిలీలో నిత్యం ఎవరో ఒకరు సోషల్ మీడియాలో నిలుస్తూనే ఉన్నారు.
ఇదిలా ఉంటే ఇటీవలే మంచు ఫ్యామిలీ నాగ శ్రీను అనే వ్యక్తి పై పోలీస్ కేసు పెట్టిన విషయం తెలిసిందే.మంచు వారి కార్యాలయంలో చోరీ జరిగిందని అందుకు కారణం నాగ శ్రీను అంటూ అతడిపై కేసు పెట్టారు.
అయితే ఆ విషయంపై స్పందించిన నాగ శ్రీను ఒక సెల్ఫీ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఆ వ్యవహారం కాస్త యూటర్న్ తీసుకున్నట్లు అయ్యింది.ఆ వీడియోలో ఆ వ్యక్తి మోహన్ బాబు తన కులాన్ని దూషించే విధంగా మాట్లాడటంతో పాటు అందరి ముందు మోకాళ్లపై నిలబెట్టి అవమానించాడని తన వాదనను ఆ వీడియో ద్వారా చెప్పుకొచ్చాడు.
ఆ వీడియో తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల లోని నాయి బ్రాహ్మణ కుల సంఘాలు మంచు ఫ్యామిలీ పై తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డాయి.ఈ క్రమంలోనే నాగ శ్రీను అక్రమ సంబంధం విషయం గురించి బయటపడింది.
నాగ శ్రీను మంచు వారి ఇంట్లో పనిచేసే మహిళతో అక్రమ సంబంధం ఉందని అందుకు సంబంధించిన ఆడియో కూడా బయట పడింది.ఇక ఆడియో లీక్ పై స్పందించిన సదరు మహిళ తీవ్రస్థాయిలో మండిపడింది.
వారి ఈ వ్యవహారంలో మంచు ఫ్యామిలీ జోక్యం చేసుకోలేదని, తమ విషయాన్ని తామే సెటిల్ చేసుకున్నామని, ఈ ఘటనకు మంచు ఫ్యామిలీ కి ఎటువంటి సంబంధం లేదు అని సదరు మహిళ చెప్పుకొచ్చింది.

ఇదే విషయం పై మెగా బ్రదర్ నాగబాబు స్పందిస్తూ నాగ శ్రీను కు ఆర్థిక సహాయం అందించాడు.అతడికి 50 వేల రూపాయల చెక్కు అందించడంతో సినీ ఇండస్ట్రీలో ఇది హాట్ టాపిక్ గా మారింది.నాగబాబు మా ఎన్నికల నాటి అధికారాన్ని ఈ విధంగా తీర్చుకున్నాడు అంటూ నాగబాబు కామెంట్లు చేస్తున్నారు.
ఇదిలా ఉంటే తాజాగా నాగబాబు మరొకసారి నాగ శ్రీను పనితనం గురించి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ ని చేశారు.

నాగ శ్రీను తనని ఎంత అందంగా మలిచాడో చూపించారు నాగబాబు.ఈ నేపథ్యంలోనే అందుకు సంబంధించిన ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేశాడు.ఆ ఫోటోలను నాగబాబు ఎంతో స్టైలిష్ గా కనిపించాడు.
ఆ ఫోటోలను షేర్ చేస్తూ నీ ప్రతిభే ఎప్పుడూ నీ విజయానికి మార్గం సుగమం చేస్తుంది.ఆరోజు నీకు ఇచ్చిన చెక్కు కూడా అందుకే.
నన్ను ఇలా అందంగా మార్చినందుకె ఇచ్చాను ఇలాగే ఎప్పుడూ కష్టపడుతూ ఉండు అంటూ నాగబాబు చెప్పుకొచ్చారు.







