ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఫలితం కేవలం ఆదేశ ప్రజలపై మాత్రమే కాదు ఆ దేశాన్ని నమ్ముకుని ఉన్న విదేశీ విద్యార్ధులపై కూడా తీవ్ర ప్రభావం చూపుతోంది.ఉక్రెయిన్ వాసులు పొట్ట చేత పట్టుకుని పొరుగు దేశాలకు వలసలు వెళ్లిపోతుంటే భారత్ కి చెందిన విద్యార్ధులు, ఉద్యోగులను భారత ప్రభుత్వం ప్రత్యేక విమానాల ద్వారా సురక్షితంగా భారత్ కు తీసుకువచ్చింది.
ఇక్కడి వరకూ బాగానే ఉంది ప్రాణాలతో బయటపడ్డారు కానీ విద్యార్ధుల భవితవ్యం మాత్రం ప్రశ్నార్ధకంగా మారిపోయింది.మధ్యలోనే చదువులు ఆగిపోవడంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో విద్యార్ధులు ఉండిపోయారు.
కేంద్రం వారి చదువుల కోసం సమాలోచనలో చేస్తోంది.ఈ క్రమంలోనే
గల్ఫ్ లోని భారత సంతతికి చెందిన డా.
తుమ్బాయ్ మోఇదీన్ మధ్యలో చదువు ఆగిపోయిన భారత విద్యార్ధులు ఎవరైనా వారికి ఉచితంగా తమ వర్సిటీలో సీట్లు ఇస్తానని, స్కాలర్షిప్ లు కూడా అందిస్తానని భారీ ఆఫర్ ప్రకటించారు.మెరిట్ ఆధారంగా చేసుకుని ఉచితంగా సీట్లు, అలాగే స్కాలర్ షిప్ లు అందిస్తామని, కీలక ప్రకటనచేశారు.
ఏ విద్యార్ధి తమ చదువును మధ్యలో ఆపేయడం వారి మానసిక స్థితిపై తీవ్ర ప్రభావం చూపుతుందని, వారి చదువులు కొనసాగించేందుకు తాము ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా ఆయన కీలక ప్రకటిన చేశారు.

కర్ణాటకలోని మంగుళూరు కు చెందిన మోఇదీన్ ఎన్నో ఏళ్ళ క్రితమే యూఏఈ వెళ్లి అక్కడే స్థిరపడ్డారు.1988 లో మెడికల్ వర్సిటీని స్థాపించి ఎంతో మంది విద్యార్ధులను తీర్చి దిద్దారు.ప్రస్తుతం భారత విద్యార్ధుల పరిస్థితి అగమ్య గోచరంగా ఉందని, భారతీయ విద్యార్ధులకు తోటి భారతీయుడిగా సాయం అందించాల్సిన భాద్యత తనపై ఉందని, మధ్యలోనే ఆగిపోయిన వారి కలలను సాకారం చేసుకునేందుకు తాను సిద్దంగా ఉన్నానని ప్రకటించారు.అలాగే పలు వర్సిటీలు కూడా ఉక్రెయిన్ నుంచీ వచ్చి చదువు మధ్యలోనే ఆపేసిన విద్యార్ధులకు ఇదే తరహాలో అవకాశాలు ఇస్తున్నాయి.