కేసీఆర్ నోట సినిమా మాట.. మన యాస సక్సెస్‌ అవుతోంది

తెలంగాణ సీఎం కేసీఆర్ నేడు నిరుద్యోగుల కు బంపర్ ఆఫర్ ను ప్రకటించారు.ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఉద్యోగ ప్రకటన కు సంబంధించిన కీలక విషయాల ను సీఎం కేసీఆర్ వెల్లడించారు.

 Telangana Cm Kcr About Telugu Film , Kcr, Movie News, News In Telugu, Vijay De-TeluguStop.com

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తం గా నిరుద్యోగులు ఆసక్తి గా ఎదురు చూస్తున్న ప్రకటన ను అసెంబ్లీ లో చేయడం తో ప్రతి ఒక్కరు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.ఈ సమయం లో సీఎం కేసీఆర్ తెలుగు సినిమా గురించి ప్రస్తావించడం చర్చనీయాంశంగా మారింది.

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా మారిన తర్వాత ఎన్నో అద్భుతాలు జరిగాయంటూ సీఎం కేసీఆర్ స్పీచ్ లో పేర్కొన్నారు.అదే సమయం లో తెలంగాణ భాష యాస ను ఒకప్పుడు సరదాగా జోక్ గా తీసుకునే వారు.

Telugu Telugu-Movie

సినిమా ల్లో తెలంగాణ యాసను కామెడీ సీన్స్ కు మాత్రమే పెట్టేవారు.కానీ తెలంగాణ యాస మాట్లాడే వారు ఇప్పుడు స్టార్ట్ హీరోలు అయ్యారు.తెలంగాణ యాస మాట్లాడుతూ సినిమాల్లో నటిస్తున్న వారికి సక్సెస్లు దక్కుతున్నాయి అంటూ సీఎం కేసీఆర్ ఆనందం వ్యక్తం చేశారు.విజయ్ దేవరకొండ తో పాటు ఇంకా పలువురు యంగ్‌ హీరోలు తెలంగాణ యాస మాట్లాడుతున్న విషయం తెలిసిందే.

ఇటీవల శేఖర్ కమ్ముల దర్శకత్వం లో వచ్చిన లవ్ స్టోరీ సినిమా కూడా తెలంగాణ యాస నేపథ్యం లోనే సాగుతుంది.ఇలా తెలంగాణ యాస కు ఈ మధ్య కాలం లో తెలుగు సినిమా పరిశ్రమ లో ప్రముఖ స్థానం లభిస్తుంది.

అదే విషయాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్ చెబుతూ సంతోషాన్ని వ్యక్తం చేశారు.తెలంగాణ యాస యొక్క గొప్పతనం ఇప్పటికైనా తెలుగు సినిమా పరిశ్రమ గుర్తించినందుకు సంతోషం గా ఉందని తెలంగాణ ప్రజలు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube