ప్రభాస్ రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కిన ఛత్రపతి సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే.ఈ సినిమా ప్రభాస్ కు ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచడంతో పాటు ప్రేక్షకులను ఆకట్టుకుంది.
ఈ సినిమాలో ఒక్క అడుగు అంటూ ప్రభాస్ చెప్పిన డైలాగ్ లను ప్రేక్షకులు సులువుగా మరిచిపోలేరు.ప్రభాస్ కు జోడీగా ఈ సినిమాలో శ్రియ నటించగా బాకాఫీస్ వద్ద ఈ సినిమా భారీ స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకుంది.
రాధేశ్యామ్ ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో ముచ్చటించిన సమయంలో ఛత్రపతి సినిమా షూటింగ్ లో తనకు ఎదురైన అనుభవాల గురించి చెప్పుకొచ్చారు.ఈ సినిమాలో విలన్ గా నటించిన సుప్రీత్ నిజమైన కర్రతో తనను కొట్టారని అలా కొట్టడంతో తన వీపు పగిలిపోయిందని ప్రభాస్ ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు.
బీచ్ లో జరిగే ఫైట్ సమయంలో ఈ ఘటన చోటు చేసుకుందని ప్రభాస్ పేర్కొన్నారు.
ఆర్ట్ డైరెక్టర్ రవీందర్ ఛత్రపతి సినిమాకు కూడా పని చేశారని సముద్రంలో ఉప్పు పట్టి రవీందర్ ఆ కర్రను తయారు చేశారని ప్రభాస్ తెలిపారు.

ఎందుకు కర్ర దెబ్బ తగిలేలా తయారు చేశావని తాను అడిగితే పర్ఫెక్షన్ కోసం చేశానని రవీందర్ నుంచి సమాధానం వచ్చిందని ప్రభాస్ చెప్పుకొచ్చారు.రవీందర్ చిన్న విషయం కోసం కూడా ఎక్కువగా వర్క్ చేస్తారని ప్రతిదీ సహజంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటారని ప్రభాస్ తెలిపారు.

ఆర్ట్ డైరెక్టర్ రవీందర్ రాధేశ్యామ్ సినిమా కోసం ఏకంగా 101 సెట్లు వేశారని తెలుస్తోంది.రాధేశ్యామ్ కోసం ప్రభాస్ తీవ్రంగా శ్రమించగా ప్రభాస్ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటారో చూడాల్సి ఉంది.300 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కడం గమనార్హం.







