ఇటీవలే తాజాగా బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదలైన విషయం తెలిసిందే.అయితే షో అలా మొదలైందో లేదో అప్పుడే నామినేషన్స్ మొదలయ్యాయి.
ఈ క్రమంలోనే ఈ వారం నామినేషన్స్ లో అరియానా గ్లోరీ, నటరాజ్ మాస్టర్, సరయు, ముమైత్ ఖాన్, మిత్రశర్మ, ఆర్జే చైతూ లు తొలివారం నామినేషన్స్ లో ఉన్నారు.నామినేషన్స్ ప్రక్రియలో భాగంగా ఎక్కువమంది నటరాజ్ మాస్టర్ ని టార్గెట్ చేస్తూ వరుసగా మెడలో బోర్డులు తగిలించడం తో నామినేషన్ ప్రక్రియ రచ్చరచ్చగా సాగింది.
నటరాజ్ మాస్టర్ కూడా బిగ్ బాస్ సీజన్ ఫైవ్ లో ఏ విధంగా ఉన్నాడో ఇప్పుడు కూడా అదే విధంగా ఉన్నాడు.
దీనితో కొత్తగా వచ్చిన కంటెస్టెంట్స్ నటరాజ్ మాస్టర్ పై కోపంతో రగిలిపోతున్నారు.
ఇక ఆర్జె చైతు అయితే నటరాజ్ మాస్టర్ తనను బాడీ షేమింగ్ చేశాడంటూ భోరున ఏడ్చేశారు.నటరాజ్ మాస్టర్ కూడా నేను చేయలేదు అంటూ ఎమోషనల్ అయ్యాడు.
స్రవంతి చొక్కారపు లాంటి సాదాసీదా కంటెస్టెంట్ మాస్టర్ ని టార్గెట్ చేస్తూ ఆటిట్యూడ్ చూపిస్తూ ఇమిటేట్ చేసి మరీ నామినేట్ చేసింది.మొత్తానికి నామినేషన్స్ లో స్రవంతి కాస్త అతిగా అయినట్లు తెలుస్తోంది.
ఇకపోతే ఈ వారం నామినేషన్స్ లో ఉన్న ఏడుగురు లో ఎవరు ఎలిమినేట్ అవుతారు అన్న విషయానికి వస్తే.నామినేషన్స్ లో ఉన్న ఏడుగురిలో ఆరుగురికి కాస్తోకూస్తో ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది.కానీ మిత్రశర్మ ఎవరు అన్నది చాలామందికి తెలియదు ఫ్యాన్స్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.కాబట్టి మిత్రశర్మ కూ ఓట్లు పడే ఛాన్స్ కనిపించడం లేదు.
కాబట్టి తొలి వారం బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ మిత్రశర్మ అంటూ గట్టిగా వార్తలు వినిపిస్తున్నాయి.