మారుతున్న రోజుల్లో ప్రతి రోజు కొత్త టెక్నాలజీ పెరుగుతూనే ఉంది.టెక్నాలజీ అందుబాటు లోకి వచ్చాక కొత్త కొత్త ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు.
ఈ ప్రయోగాలు కొన్ని మనకి అద్భుతంగా కనిపిస్తే.మరికొన్ని ఆశ్చర్యంగా అనిపిస్తాయి.
ఇలాంటి అద్భుతాలను కనిపెట్టినప్పుడు మనం వావ్ అనకుండా ఉండలేము.ఇలాంటివి చూసినప్పుడే టెక్నాలిజీ ఎంత పెరిగిందో అర్ధం అవుతుంది.
తాజాగా ఇప్పుడు మనం తెలుసు కోబోయే విషయం మీరు విన్నా ఇదే చెబుతారు.ఇలా కూడా సాధ్యం అవుతుందా అని తప్పక ఆలోచిస్తారు.
ఇప్పుడు మారుతున్న రోజుల్లో డ్రైవర్ అవసరం లేకుండానే కార్లు, డ్రోన్ లు నడుస్తున్నాయి.ఇప్పుడు కొత్తగా పైలెట్ లేకుండానే హెలికాఫ్టర్ కూడా నడిచే విధంగా తయారు చేసి అద్భుతం అనిపిస్తున్నారు.

పైలెట్ అవసరం లేకుండానే హెలికాఫ్టర్లు అందుబాటులోకి రాబోతున్నాయి.సాధారణంగా వాతావరణం అనుకూలించకుంటే విమానాలు, హెలికాఫ్టర్ లు రద్దు చేస్తూ ఉంటారు.కానీ పైలెట్ రహిత హెలికాఫ్టర్లు వాతావరణం అనుకూలించని సమయంలో కూడా పయనించే విధంగా హెలీకాఫ్టర్లను తయారు చేస్తున్నారు.ఇలాంటి హెలికాఫ్టర్ ఇటీవలే ఆకాశంలో చక్కర్లు కొట్టింది.

టేకాఫ్ నుంచి 30 నిముషాల పాటు ఆకాశంలో చక్కర్లు కొట్టింది.నాలుగు వేల అడుగుల ఎత్తులో గంటకు 115 నుండి 125 మైళ్ళ వేగంతో ప్రయాణం చేసింది.అనంతరం సురక్షితంగా ల్యాండ్ అయ్యింది.యుఎస్ డిఫెన్స్ రీసెర్చ్ లో భాగంగా ఈ అలియాస్ అనే హెలికాఫ్టర్ ను కెంటకీ లోని ఫోర్ట్ బేస్ నుండి ట్రయల్స్ ను నిర్వహించారు.
త్వరలోనే వీటిని ఆర్మీలో ప్రవేశ పెట్టబోతున్నారు.
పగలు, రాత్రి అనే తేడా లేకుండా ఈ పైలెట్ రహిత హెలికాఫ్టర్ సులభంగా ప్రయాణం చేయడమే కాకుండా వాతావరణం అనుకూలించక పోయిన కూడా ఈ హెలికాఫ్టర్ సురక్షితంగా ప్రయాణం చేస్తుందని అలియాస్ అధికారులు చెబుతున్నారు.
మరి ఈ విషయం విన్నవారంతా హ్యాట్స్ ఆఫ్ చెబుతున్నారు.







