సామాన్య ప్రజలకు గ్యాస్ సిలిండర్ ధర తలుచుకుంటే చాలు భయం పుడుతుంది.అప్పట్లో గ్యాస్ సిలిండర్ ధర 500 నుంచి 600 మధ్యన ఉండేది.
కానీ ప్రస్తుత పరిస్థితులలో గ్యాస్ సిలిండర్ ధర ఏకంగా 950 రూపాయిల దాక ఉంది.రాను రాను గ్యాస్ ధర పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు.
అసలే కరోనా కష్టకాలం ఆర్ధిక పరిస్థితి చూస్తే అంతంత మాత్రంగానే ఉండడడంతో ఇప్పుడు గ్యాస్ పేరు ఎత్తితే చాలు ప్రజలు భయపడిపోతున్నారు.ప్రస్తుతం మనం ఇళ్లల్లో వాడే గ్యాస్ సిలిండర్ ధర 952 రూపాయలుగా ఉండగా, కమర్షియల్ సిలిండర్ ధర రూ.2087 గా ఉంది.అయితే ఇప్పుడు మీకొక శుభవార్త.
అది ఏంటంటే మీరు కనుక ఈ యాప్ లో గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకుంటే మీకు గ్యాస్ బుకింగ్ పై 75 రూపాయిల క్యాష్ బ్యాక్ పొందవచ్చు.మరి ఆ యాప్ యొక్క వివరాలు ఏంటో తెలుసుకుందామా.
మీకు బజాజ్ ఫిన్‌సర్వ్ యాప్ గురించి తెలిసే ఉంటుంది.ఈ యాప్ ద్వారా కనుక మీరు గ్యాస్ సిలిండర్ ను బుక్ చేస్తే రూ.75 క్యాష్ వస్తుందని తెలిపింది.మరి ఎలా ఈ యాప్ ద్వారా గ్యాస్ సిలిండర్ ను బుక్ చేసుకోవాలో చూద్దామా.

మొదటగా మీరు బజాజ్ ఫిన్‌సర్వ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకున్న తరువాత ఆ యాప్‌ని ఓపెన్ చేయండి. ఫోన్ నెంబర్ తో రిజిస్టర్ అయ్యాక యాప్ ఓపెన్ చేసి బిల్లులు, రీఛార్జ్ విభాగంలోని వ్యూ ఆల్‌పై క్లిక్ చేయండి.అప్పుడు అందులో యుటిలిటీస్ & బిల్ సెక్షన్ లో LPG గ్యాస్ సిలిండర్ ను ఎంపిక చేసుకుని అక్కడ క్లిక్ చేయండి.ఆ తరువాత మీ గ్యాస్ సిలిండర్ యొక్క సర్వీస్ ప్రొవైడర్‌ను ఎంచుకోవాలి.
తరువాత వినియోగదారు నంబర్‌ను నమోదు చేయండి.వెంటనే మీ బుకింగ్ అమౌంట్ ఎంత అనేది మీకు కనిపిస్తుంది.
ఆ తరువాత ప్రొసీడ్ టూ పే అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి.అప్పుడు మీకు అప్లై ప్రోమో కోడ్ అనేది సెలెక్ట్ చేసుకుని అక్కడ GAS75 అని టైప్ చేయండి.
అప్పుడు మీరు గ్యాస్ బుకింగ్ పై 10% అంటే గరిష్టంగా 75 రూపాయిలు తగ్గింపు పొందుతారు.ఆ తరువాత పెమెంట్ చేస్తే సరిపోతుంది.







