తెలుగు లో మరో సారి బిగ్ బాస్ సందడి మొదలు కాబోతుంది.డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న బిగ్ బాస్ ఎంటర్ టైన్మెంట్ ను రెట్టింపు స్థాయిలో ఇస్తుందంటూ నిర్వాహకులు బలంగా నమ్మకంగా బల్ల గుద్ది మరీ చెబుతున్నారు.
ఈ స్పెషల్ బిగ్ బాస్ కి కంటెస్టెంట్ గా ఎక్కువ శాతం మంది పాత వాళ్లే అంటే గత సీజన్లో కనిపించిన వాళ్లే ఉండబోతున్నారని టాక్ వినిపిస్తుంది.ఇదే సమయం లో కొత్త వారికి కూడా ఛాన్స్ ఇవ్వబోతున్నారు.
ఆ కొత్త వారిలో ఎక్కువగా సోషల్ మీడియా ద్వారా పాపులారిటీ దక్కించుకున్న వారు ఉంటారని సమాచారం అందుతోంది.బిగ్ బాస్ హడావుడి ప్రారంభమైన ప్రతి సారి కూడా ఒక్కరు ఇద్దరు రికమండేషన్ ద్వారా ఎంట్రీ ఇచ్చారు అనే టాక్ వస్తూ ఉంటుంది.

ఈసారి కూడా బిగ్ బాస్ లోకి మెగా డాటర్ నిహారిక రికమండేషన్ ద్వారా కాస్కో యూట్యూబ్ ఛానల్ యాంకర్ నిఖిల్ ఎంట్రీ ఇవ్వబోతున్న ట్లుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి.మామూలుగా అయితే నిఖిల్ కు రికమండేషన్ అవసరం లేదు.అతడు సోషల్ మీడియా లో మంచి పాపులారిటీ సంపాదించుకున్న వ్యక్తి.అతనికి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు.కానీ అతనికి నిహారిక మంచి స్నేహితురాలు అతడిని తమ్ముని కంటే ఎక్కువగా నిహారిక చూస్తుంది అంటూ ఇండస్ట్రీ వర్గాల్లో టాక్.కనుక అతడి ని బిగ్ బాస్ లోకి పంపించడానికి నిహారిక తన వంతు ప్రయత్నాలు చేసింది అంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
అందులో నిజం లేకపోవచ్చు కానీ బిగ్ బాస్ లోకి కాస్కో యూట్యూబ్ ఛానల్ ద్వారా నిఖిల్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అనేది మాత్రం పక్కా.గతంలో బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఎంతో మంది ని ఇంటర్వ్యూ చేసిన అనుభవం ఉన్న నిఖిల్ ఈ సీజన్లో మంచి పాపులారిటీని దక్కించుకునే అవకాశం ఉందని.
టాప్ 5 లో కూడా నిలిచే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.