ఇప్పుడు ప్రెసెంట్ అన్ని ఇండస్ట్రీలలో మల్టీ స్టారర్ సినిమాల హవా నడుస్తున్న విషయం తెలిసిందే.మన టాలీవుడ్ లో కూడా మల్టీ స్టారర్ సినిమాల జోరు నడుస్తుంది.
ఇప్పుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ సినిమా విడుదలకు సిద్ధమయ్యింది.ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న విషయం విదితమే.
ఈ సినిమా స్పూర్తితో మరిన్ని మల్టీ స్టారర్ సినిమాలు తెరకెక్కేందుకు రెడీ అవుతున్నాయి.ఇప్పుడు మెగా మల్టీ స్టారర్ సినిమా రాబోతుంది అని ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి.
దీనికి సంబంధించిన వార్త ఒకటి నెట్టింట హాట్ టాపిక్ అయ్యింది.పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తో కలిసి ఒక సినిమా చేయబోతున్నారని ప్రచారం జరుగుతుంది.
పవన్, సాయి ధరమ్ తేజ్ కలిసి మెగా మల్టీ స్టారర్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని అంటున్నారు.ఈ సినిమా తమిళంలో సూపర్ హిట్ అయిన వినోదయ సీతం రీమేక్ అంటున్నారు.

తమిళంలో ఈ సినిమాను సముద్రఖని, తంబి రామయ్య ప్రధాన పాత్రల్లో నటించగా.తెలుగులో పవన్, సాయి ధరమ్ తేజ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కించడానికి సన్నాహాలు జరుగుతున్నాయట.

తమిళంలో డైరెక్టర్ గా వ్యవహరించిన సముద్రఖని ఈ సినిమాకు తెలుగులో కూడా దర్శకత్వం వహించే అవకాశాలు కూడా ఉన్నాయంటూ వార్తలు గట్తిగానే వినిపిస్తున్నాయి.ఇప్పటికే ఆయన మెగా హీరోలిద్దరిని సంప్రదించారని వీరిద్దరూ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.ఈ సినిమాను త్వరలోనే అధికారికంగా కూడా ప్రకటించే అవకాశం ఉన్నట్టు టాక్.మరి చూడాలి మెగా మల్టీ స్టారర్ వర్క్ అవుట్ అవుతుందో లేదో.







