అతి త్వరలో ట్విట్టర్ లో సరికొత్త ఫీచర్..!

ప్రపంచంలో అత్యంత పాపులర్ సోషల్ మీడియా ప్లాట్​ఫామ్​గా కొనసాగుతుంది ట్విట్టర్.తమ యూజర్ల కోసం ట్విట్టర్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్ లను అందుబాటులోకి తీసుకొస్తూనే వుంటుంది.

యూజర్ల కోసం గతేడాది ‘ట్విట్టర్​ స్పేసెస్’​ అనే​ ఆడియో గ్రూప్​ చాట్​ ​ఫీచర్​ను పరిచయం చేసిన సంగతి తెలిసిందే.ఈ ఫీచర్​ ద్వారా యూజర్లు ఆన్‌లైన్‌లో ఆడియో చర్చలు చేయవచ్చు.

ఇక ట్విట్టర్​ త్వరలోనే ఫ్లాక్​ పేరుతో కొత్త ఫీచర్​ను యాడ్ చేసే ఆలోచనలో ఉంది.దీని వలన యూజర్లు తమ ట్వీట్ ని ఎవరు చూడాలో నిర్ణయించుకోవచ్చు.

ఇప్పుడు ఒక యూజర్ కు 100 మంది ఫాలోవర్స్ ఉన్నారనుకోండి.ఆ యూజర్ ట్వీట్ చేస్తే.

Advertisement

దాన్ని మిగిలిన 99 మంది చూస్తారు.అయితే.ట్విట్టర్ ఫ్లాక్ అనే ఫీచర్ అందుబాటులోకి రావడం ద్వారా.

ఒక ట్వీట్ చేసి.దాన్ని తమ ఫాలోవర్స్ లో ఎవరికి కనపడాలి అనేది కూడా మనం సెట్ చేసుకోవచ్చు.

తెలిసిన సమాచారం మేరకు.ఇన్‌స్టాగ్రామ్‌లోని క్లోజ్ ఫ్రెండ్స్ ఫీచర్ వలె ఈ ట్విట్టర్ ఫ్లాక్ అనే కొత్త ఫీచర్‌ ఉండనుంది.

తాజాగా రివర్స్ ఇంజనీర్ అలెశాండ్రో పలుజ్జీ కొత్త ఫీచర్​ కు సంబంధించిన కొన్ని ఆసక్తికర వివరాలను పంచుకున్నాడు.మొదట ట్రస్టెడ్ ఫ్రెండ్స్ పేరుతో తయారైన ఈ ఫీచర్ ఆ తర్వాత ​ఫ్లాక్ గా మారింది.ఈ ఫీచర్​ ద్వారా ట్విట్టర్​ యూజర్లు తమ ఫాలో అవుతున్న వారిలో ​150 మందిని ఒక గ్రూప్​గా ఎంచుకోవచ్చు.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?

ఈ గ్రూప్​తో మాత్రమే వారు ట్వీట్లను షేర్​ చేసుకునే వీలుంటుంది.ఈ గ్రూప్​లో షేర్​ చేసిన ట్వీట్లను ఈ గ్రూప్​లోని సభ్యులు మాత్రమే చూడగలుగుతారు.బయటి వారికి ఇవి కనిపించవు.

Advertisement

అలాగే ఆ ట్వీట్లకు రిప్లై ఇవ్వాలన్నా.ఆ గ్రూపులో వాళ్ళు మాత్రమే ఇవ్వగలరు.

ఈ ఫ్లాక్​ గ్రూప్ నుంచి ఎవరినైనా తీసేసినా.ఆ సభ్యుడికి ఎలాంటి నోటిఫికేషన్​ వెళ్లదని అలెజాండ్రో తెలిపారు.

త్వరలోనే ఈ ఫీచర్ అందుబాటులోకి రానుంది.

తాజా వార్తలు