వాట్సాప్ సేవలన్నీ బంద్.. ఆ యూజర్లకు అలర్ట్..

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ లేనిదే చాలామందికి పూట గడవదు.ఆ స్థాయిలో చాలామంది జీవితాల్లో వాట్సాప్ అంతర్భాగమైంది.

వ్యాపారస్తులకు కూడా వాట్సాప్ బాగా ఉపయోగపడుతుంది.అయితే వాట్సాప్ సేవలన్నీ ఈ ఏడాది జనవరి లోగా పూర్తిగా నిలిచిపోనున్నాయి.

ప్రస్తుతం ఎవరైతే పాత స్మార్ట్‌ఫోన్లు వాడుతున్నారో వారందరికీ వాట్సాప్ సంస్థ అలర్ట్ జారీ చేసింది.పాత ఫోన్లలో వాట్సాప్ సేవలన్నీ బంద్ అవుతాయని సదరు సంస్థ ప్రకటించింది.

అలాగే ఆ పాత స్మార్ట్‌ఫోన్ల జాబితాను తాజాగా రిలీజ్ చేసింది.అందులో శాంసంగ్, యాపిల్ ఫోన్లు కూడా ఉండటం విశేషం.

Advertisement

ఇవి చాలా పాత ఫోన్లు కావడమే ఇందుకు కారణం.పాత ఫోన్లు కావడం వల్ల కొత్త అప్‌డేట్స్ కు సపోర్ట్ చేయడం లేదు.

దీనివల్ల యూజర్ల భద్రతకు భంగం వాటిల్లే ప్రమాదం ఎక్కువ.అందుకే పాత మొబైల్ ఫోన్లు పక్కన పెట్టి కొత్తవి వాడాల్సిందిగా వాట్సాప్ సూచిస్తోంది.

తాజాగా మరో 30 స్మార్ట్‌ఫోన్లలో వాట్సాప్ సర్వీసెస్ ఆగిపోతాయని ప్రముఖ మెసేజింగ్ యాప్ వెల్లడించింది.మరి ఆ స్మార్ట్‌ఫోన్ మోడల్స్ ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.

యాపిల్ ఐఫోన్ ఎస్ఈ, యాపిల్ ఐఫోన్ 6S, యాపిల్ ఐఫోన్ 6S ప్లస్, ఆర్కోస్‌ 53 ప్లాటినం, క్యాటర్‌పిల్లర్‌ క్యాట్ బీ15, ఫానా ఎఫ్1, హెచ్‌టీసీ డిజైర్‌ 500, హువావే అసెండ్ డీ2, హువావే అసెండ్ జీ740, హువావే అసెండ్ మేట్, లెనోవో A820, ఎల్‌జీ యాక్ట్, ఎల్‌జీ లూసిడ్ 2, ఎల్‌జీ ఆప్టిమస్‌ F3, ఎల్‌జీ ఆప్టిమస్‌ F3Q, ఎల్‌జీ ఆప్టిమస్‌ F5, ఎల్‌జీ ఆప్టిమస్‌ F6, ఎల్‌జీ ఆప్టిమస్‌ F7, ఎల్‌జీ ఆప్టిమస్‌ L2 II, ఎల్‌జీ ఆప్టిమస్‌ L3 II, ఎల్‌జీ ఆప్టిమస్‌ L3 II డ్యూయల్‌, ఎల్‌జీ ఆప్టిమస్‌ L4 II, ఎల్‌జీ ఆప్టిమస్‌ L4 II డ్యూయల్‌, ఎల్‌జీ ఆప్టిమస్‌ L5 II, ఎల్‌జీ ఆప్టిమస్‌ L5 II డ్యూయల్‌, ఎల్‌జీ ఆప్టిమస్‌ L7 II, ఎల్‌జీ ఆప్టిమస్‌ L7 II డ్యూయల్‌, మినీ శాంసంగ్ గెలాక్సీ S3, శాంసంగ్ గెలాక్సీ ఏస్ 2, శాంసంగ్ గెలాక్సీ కోర్, శాంసంగ్ గెలాక్సీ ట్రెండ్ II, శాంసంగ్ గెలాక్సీ ట్రెండ్ లైట్, శాంసంగ్ గెలాక్సీ ఎక్స్‌కవర్‌ 2, సోనీ ఎక్సీపీరియా M, టీహెచ్‌ఎల్‌ డబ్ల్యూ8, వికో డార్క్‌లైట్, వికో సింక్‌ ఫైవ్‌, జెడ్‌టీఈ గ్రాండ్ మెమో, జెడ్‌టీఈ గ్రాండ్ S ఫ్లెక్స్, జెడ్‌టీఈ గ్రాండ్ ఎక్స్‌ క్వాడ్ v987, జెడ్‌టీఈ V956 - UMI X2.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?

పైన పేర్కొన్న ఫోన్ మోడల్స్‌లో వాట్సాప్ ఇకపై పనిచేయదు.మీరు మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్లో 4.1 వెర్షన్ కన్నా ఎక్కువ ఆపరేటింగ్ సిస్టమ్ ఉండేలా జాగ్రత్త పడాలి.లేదంటే కొత్త ఫోన్ కు అప్‌గ్రేడ్ అవుతే సరిపోతుంది.

Advertisement

ఇక ఐఫోన్ యూజర్లు ఐఓఎస్ 9 కన్నా ఎక్కువ ఆపరేటింగ్ సిస్టమ్‌కు అప్‌గ్రేడ్ కావాలి.

తాజా వార్తలు