కోలీవుడ్ హీరో శివ కార్తికేయన్ ఓ తెలుగు సినిమా చేస్తున్నాడన్న వారలు వచ్చిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో ఆ సినిమాకు సంబందించిన అఫీషియల్ అప్డేట్ వచ్చింది.
జాతిరత్నాలు డైరక్టర్ అనుదీప్ కెవి డైరక్షన్ లో శివ కార్తికేయన్ హీరోగా సినిమా వస్తుంది.ఈ సినిమాను బైలింగ్వల్ గా రాబోతుంది.
ఈ సినిమాను ఎనౌన్స్ చేస్తూ చిత్రయూనిట్ సర్ ప్రైజ్ చేశారు.
శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ లో సునీల్ నారంగ్ ఈ సినిమా నిర్మిస్తున్నారు.
సినిమా ఎనౌన్స్ మెంట్ కోసం రిలీజ్ చేసిన ఈ వీడియో క్రేజీగా ఉందని చెప్పొచ్చు.జాతిరత్నాలు సినిమాతో మెప్పించిన డైరక్టర్ అందీప్ కెవి ఈసారి శివ కార్తికేయన్ తో తెలుగు, తమిళ భాషల్లో సత్తా చాటాలని చూస్తున్నాడు.
రీసెంట్ గా శివ కార్తికేయన్ నటించిన వరుణ్ డాక్టర్ సినిమా తెలుగులో కూడా సూపర్ సక్సెస్ అయ్యింది.శివ కార్తికేయన్ తెలుగు ఆడియెన్స్ కు దగ్గరయ్యేందుకు అనుదీప్ సినిమా ప్లస్ అవుతుందని చెప్పొచ్చు.
ఆర్.ఆర్.ఆర్ తమిళ ఈవెంట్ కి కూడా శివ కార్తికేయన్ గెస్ట్ గా వచ్చి అక్కడ తెలుగు సినిమాకు తన సపోర్ట్ అందించారు.