చేపలు తినడానికి ఎంతో రుచికరంగా ఉండడంతో పాటు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి.అయితే రానున్న రోజుల్లో మనకు చేపలు చాలా అరుదుగా దొరకనున్నాయి.
ఎందుకంటే చెరువుల్లోని చేపలకు ముప్పు ఏర్పడిందని అంటున్నారు మత్స్యకారులు.కొన్ని లక్షల సంఖ్యలో చేపపిల్లలను చెరువులోకి వదిలితే అవి వేలల్లోనే మిగులుతున్నాయి.
చెరువుల్లోని చేపలు చెరువులోనే మాయం అవడానికి గల కారణం ఏంటో తెలిస్తే మీరే షాక్ అవుతారు. చెరువుల్లోని చేపలు మాయం అవ్వడానికి గల కారణం కూడా మరొక చేప అవ్వడమే గమనార్హం.
దీనినే దెయ్యం చేప అని అంటున్నారు మత్స్యకారులు.సముద్రంలో చిన్న చితకా చేపల్ని తిని బతికే ఈ దెయ్యం చేప ఇప్పుడు మన చెరువుల్లోకి ప్రవేశించడంతో చేపల దిగుబడి కూడా భారీగా తగ్గిపోయింది.
అసలు మన ప్రాంతంలో లభించని ఈ చేప ఇక్కడి చెరువుల్లోకి ఎలా వచ్చిందో, ఏంటో అనే వివరాలు తెలుసుకుందాం.
మహబూబ్ నగర్ జిల్లా బుద్దారం చెరువులో జాలరులకు ఈ అరుదైన, అత్యంత ప్రమాదకరమైన దెయ్యం చేపలు దొరుకుతున్నాయి.
క్యాట్ పిష్ జాతికి చెందిన ఈ చేపలు అమెరికాలోని అమెజాన్ నదిలో ఉంటాయి.అలాంటి ఈ చేప ఇక్కడ లభించడంతో అందరు ఆశ్చర్యపోతున్నారు.
దీనిని దెయ్యం చేప, బల్లిచేప అని, అమెజాన్ సైల్ఫీన్ క్యాట్ ఫిష్ అని కూడా పిలుస్తారు.క్యాట్ ఫిష్ జాతీకి చెందిన ఈ చేప వింత ఆకారంలో ఉండడంతో పాటుగా, శరీరంపై ముళ్లు కలిగి చూడ్డానికి భయంకరంగా ఉంది.
దీని మాంసం కూడా ఎరుపు రంగులో ఉంటుంది.సాగు చేసే చేపల్ని తినేసి, రైతులకు నష్టం కలిగించడంతో పాటు మత్స్యకారుల వలల్ని కూడా నాశనం చేస్తున్నాయి.
ఈ చేపకు ఉన్న మరొక ప్రత్యేకత ఏంటంటే.నీరు లేకపోయినప్పటికీ ఈ చేప 15 రోజులకుపైగా బతకగలదు.
నీటిలోనే కాకుండా భూమిపైనా ప్రయాణిస్తూ సమీపంలోని జిలాల్లోకి ప్రవేశించి అక్కడ తమ సంతతిని వేగంగా పెంచుకోగలదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.ఇతర ప్రాంతాల నుంచి ఈ ప్రాంతానికి చేపలు వలస వచ్చే అవకాశం అయితే లేదు.
ఒకవేళ విత్తన చేపల్లో ఈ చేప పిల్లలు వచ్చి ఉంటాయని మత్సకారులు భావిస్తున్నారు.ఆ పిల్ల చేపలు కాస్త పెరిగి తన సంతతిని పెంచుకుని మాములు చేపలను తినేస్తున్నాయని మత్య్సకారులు చెబుతున్నారు.
ఈ దెయ్యపు చేపలను అరికట్టకపోతే చేపల సాగులో రైతులు నష్టాన్ని చవిచూడాలిసి వస్తుంది.అయితే మత్య్సకారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.
ఒకవేళ ఈ చేప కనుక దొరికినట్లైతే వెంటనే దానిని భూమిలో పాతి పెట్టాలని మత్య్సశాఖ అధికారులు సూచిస్తున్నారు.







