1.సౌదీ వెళ్లే వారికి గుడ్ న్యూస్
సౌదీ భారత్ మధ్య విమాన సర్వీసులకు లైన్ క్లియర్ అయింది ఈ మేరకు సౌదీలోని ఇండియన్ ఎంబసీ క్రియేట్ చేసింది.దీనిలో భాగంగా 2022 జనవరి 1 నుంచి రెండు దేశాల మధ్య విమాన సర్వీసులు ప్రారంభం అవుతాయని ట్విట్ లో పేర్కొంది.
2.భారత సంతతి వ్యక్తికి దక్షిణాఫ్రికా అవార్డు

భారత సంతతికి చెందిన వితరణశీలి ‘ గిఫ్ట్ ఆఫ్ ది గివర్స్ ‘ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు ఇంతియాజ్ సులేమాన్ ప్రతిష్టాత్మక ‘సౌత్ ఆఫ్రికన్ ఆఫ్ ది ఇయర్ ‘ అవార్డుకు ఎంపికయ్యారు.
3.ప్రవాసుల ను పెళ్ళాడిన కువైట్ మహిళల కోసం కొత్త సర్వీసులు
ప్రవాసుల ను పెళ్ళాడిన కువైట్ మహిళల కోసం అక్కడి ప్రభుత్వం కొత్త సర్వీసులను తీసుకువచ్చింది.వీరి కోసం ప్రత్యేకంగా సిటిజన్ సర్వీస్ సెంటర్లను తెరిచింది.
4.గ్రీన్ లిస్ట్ దేశాల జాబితాను సవరించిన అబుదాబి
యూఏఈ రాజధాని అబుదాబి తాజాగా మరో సారి గ్రీన్ లిస్ట్ దేశాల జాబితాను సవరించింది.ఈ జాబితాలో 73 దేశాలకు చోటు కల్పించింది.ఈ దేశాల నుంచి అబుదాబి వచ్చే ప్రయాణీకులు కారంటైన్ లో ఉండాల్సిన అవసరం లేదని ప్రకటించింది.ఈ జాబితాలో భారత్ తో పాటు పాకిస్తాన్ ,బంగ్లాదేశ్, శ్రీలంక కు చోటు దక్కలేదు.
5.దుబాయ్ నుంచి వచ్చే వారికి కొత్త మార్గదర్శకాలు

దుబాయ్ నుంచి ముంబై వచ్చే వారికి మహారాష్ట్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది.దుబాయ్ నుంచి వచ్చే ముంబై వాసులు ఏడు రోజుల పాటు క్వారంటైన్ లో ఉండడం తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
6.విదేశీ రాకపోకలపై కువైట్ ప్రత్యేక నిబంధనలు
కరోనా కొత వేరియంట్ ఒమి క్రాన్ వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో అంతర్జాతీయ రాకపోకలపై కొత్త నిబంధనలు విధించింది.దేశ పౌరులు విదేశాలకు వెళ్లాలనుకునే వారు కరోనా వ్యాక్సిన్ తీసుకుని 9 నెలలు గడిచిన వారు తప్పనిసరిగా బూస్టర్ డోస్ తీసుకోవాలని, లేకపోతే దేశం నుంచి బయటకు వెళ్లేందుకు అనుమతించకూడదు అని నిర్ణయించింది.
7.డల్లాస్ లో తానా కళాశాల అభినందన కార్యక్రమం

తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా ( తానా) ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘ తానా కళాశాల’ అభినందన కార్యక్రమాన్ని డి ఎఫ్ డబ్ల్యు కార్యవర్గం ఫ్రిస్కో లోని శుభం ఈవెంట్ సెంటర్ లో ఘనంగా నిర్వహించారు.
8.వర్క్ వీసాల పై అమెరికా కీలక నిర్ణయం
వర్క్ వీసాలు జారీ లో అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది.హెచ్1బి సహా అనేక రకాల వీసాల కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు వ్యక్తిగత ఇంటర్వెల్ నుంచి తాత్కాలికంగా మినహాయింపు ఇచ్చింది.
9.దక్షిణాఫ్రికా అత్యున్నత ధర్మాసనానికి జడ్జిగా భారత సంతతి వ్యక్తి

దక్షిణాఫ్రికాలో అత్యున్నత ధర్మాసనం అయిన కాన్స్టిట్యూషన్ కోర్టుకు న్యాయమూర్తిగా భారత సంతతికి చెందిన నరేంద్రన్ జోడి కొల్లా పెన్ ను న్యాయమూర్తి ఎంపిక చేసినట్లు దేశాధ్యక్షుడు సిరిల్ రామ ఫోనా తాజాగా ప్రకటించారు.







