48 ఏళ్లుగా చెయ్యి దించని సాధువు.. అసలు విషయం తెలిస్తే అవాక్కవుతారు..!

సాధువులు, అఘోరాలు, ఋషులు ఇలా సామాన్య మానవులకు పూర్తి భిన్నంగా ఉండే వ్యక్తులకు అతీత శక్తులు ఉన్నాయని చాలామంది నమ్ముతుంటారు.

ఎందుకంటే వీరు సామాన్య మనుషులకు సాధ్యం కాని పనులను చేసి చూపిస్తుంటారు.

ఎముకలను గడ్డకట్టించే చన్నీటితో వీరు స్నానం చేస్తుంటారు.శరీరాన్ని కాల్చేసే మంటలో వీరు పడుకుంటారు.

ఇవన్నీ చూస్తే సాధువులకు అత్యంత అద్భుత శక్తులు ఉన్నాయని ఎవరైనా సరే ఒప్పుకోక తప్పదు.అయితే మనం చెప్పుకోబోయే ఒక సాధువు ఈ కోవకు చెందిన వారే.

ఈ సాధువు గత 48 ఏళ్లు క్రితం తన చెయ్యిని పైకి ఎత్తారు.ఆ రోజు నుంచి ఇప్పటి వరకు తన చెయ్యి కిందకి దించిన క్షణమే లేదంటే అతిశయోక్తి కాదు.

Advertisement

వివరాల్లోకి వెళితే.అమర భారతి అనే సాధువు 1973లో తన కుడిచేతిని పైకి ఎత్తారు.

ఆ రోజు నుంచి అతను తన చేతిని కిందికి దించలేదు.సాధారణంగా సామాన్యులు తమ చేతిని పదినిమిషాల కంటే ఎక్కువగా ఎత్తి ఉంచలేరు.

అలా ఉంచితే రక్తప్రసరణ చేతికి అందక నరాలు విపరీతంగా గుంజేస్తాయి.ఆ చెయ్యి బాగా తిమ్మిరి పట్టి అచేతనంగా మారుతుంది.

ఇంకా ఎక్కువ సమయం ఉంచడం అనేది ఎవరికైనా అసాధ్యమే.కానీ అమర భారతి అనే సాధువు ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించారు.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?

ప్రపంచంలో సత్యం, శాంతి, ధర్మం విలసిల్లాలని సదాశివుణ్ణి కోరుతూ ఆయన తన చేతిని పైకెత్తారట.ఆ క్షణం నుంచి ఆయన తన చేతిని అలాగే ఉంచారట.

Advertisement

భోజనం చేసేటప్పుడు, పడుకునేటప్పుడు, స్నానం చేసేటప్పుడు ఇలా ప్రతి నిమిషము కూడా అతను తన కుడిచేతిని పైకెత్తే ఉంచుతారు.

అయితే అతను కేవలం ఒంటిచేత్తో పనులు చేసుకోవడానికి చాలా కష్టపడుతున్నారు.అయినప్పటికీ ప్రపంచ శాంతి నెలకొల్పాలనే తన ఆశయం ముందు ఈ కష్టాలన్నీ చిన్నవేనని ఆయన చెబుతున్నారు.48 సంవత్సరాలుగా చేతిని పైకెత్తి ఉంచడం సాధ్యం అయ్యింది అంటే దాని వెనక శివుని మహత్యం ఉందని శివ భక్తులు నమ్ముతుంటారు.అమర భారతి సన్యాసిగా మారకముందు అందరిలాగే సాధారణ జీవితాన్ని గడిపేవారు.

బ్యాంకు ఉద్యోగం చేస్తూ భార్య పిల్లలతో సంతోషంగా ఉండేవారు.అయితే సాధారణ జీవితంతో తృప్తి పొందని ఆయన ఒకరోజు సడెన్‌గా దైవత్వంపై మక్కువ పెంచుకున్నారు.

అప్పుడే తన జీవితాన్ని పూర్తిగా దేవుడికే అర్పించాలని సన్యాసిగా మారారు.దైవ సంకల్పంతో ఎవరికీ సాధ్యం కాని పని చేసి ఈ సాధువు ప్రస్తుతం అందరిలో ప్రత్యేకమైన సాధువుగా నిలుస్తున్నారు.

తాజా వార్తలు