వెంకటేష్ నే చూడలేదు.. శ్రీకాంత్ ని ఆ సీన్ లో చూస్తారా అని వెక్కరించారు.. డైరెక్టర్ చంద్రమహేష్

ప్రేయసి రావే సినిమాకు హీరోహీరోయిన్లు ఎవరా అని వెతుకుతున్నపుడు మొదటగా శ్రీకాంత్ గారి తమ్ముడు క్రాంతి గారిని సంప్రదించామని ప్రముఖ దర్శకుడు చంద్ర మహేశ్ అన్నారు.

కానీ ఆయన అప్పటికే వేరొక సినిమా చేస్తుండడంతో అతనితో వీలు కాలేదని ఆయన స్పష్టం చేశారు.

ఆ సమయంలో ఈ సినిమా కథ చాలా బాగుందని విని హీరో శ్రీకాంత్‌ గారే వచ్చి తాను ఈ సినిమాలో చేస్తానని చెప్పారని ఆయన తెలిపారు.అప్పటికే తాజ్ మహల్ సినిమాతో శ్రీకాంత్ హిట్ కొట్టడంతో రామానాయుడు కూడా ఓకే చేశారని ఆయన అన్నారు.

ఆ తర్వాత అంతే ఓకే అయ్యి, ఇంకో 15 రోజుల్లో షూటింగ్ మొదలుపెడతాం అనగా చాలా సమస్యలను ఎదుర్కోవాల్సి వచ్చిందని ఆయన తెలిపారు.మొదట ఆర్‌.

బి.చౌదరికి కథ చెప్పినపుడు అంతా బాగుంది కానీ, ఆ క్లైమాక్స్ మాత్రం మార్చేయండి అని అన్నట్టు ఆయన తెలిపారు.అంతే కాకుండా అంత పెద్ద స్టార్ వెంకటేష్ గారే శీను సినిమాలో నాలుక కోసుకుంటే ఆడలేదిక్కడ.

Advertisement

అలాంటిది శ్రీకాంత్ గుండె ఇస్తే చూస్తారా ? అదీ కాకుండా శ్రీకాంత్ కూడా అంత పెద్ద ఇమేజ్ ఉన్న స్టార్ ఏమీ కాదు కదా అని ఆయన అన్నట్టు మహేశ్ చెప్పుకొచ్చారు.

ఇక అందరూ చెప్పడంతో రామానాయుడు కూడా కథ నీకు, నాకూ నచ్చింది గానీ వేరేవరికీ నచ్చడం లేదని వెంటనే ఆ క్లైమాక్స్ మార్చు, షూటింగ్ మొదలుపెడదాం అని ఆయన అన్నట్టు మహేశ్ చెప్పారు.దాంతో తాను అనుకుందే క్లైమాక్స్‌ను ఊహించుకొని.ఇదేంటీ ఇలా జరుగుంతుందేంటీ అనుకొని, రామానాయుడు గారితో.

ఓకే సర్ క్లైమాక్స్ ఒక్కటే కదా.మార్చేద్దాం సర్.వెంటనే షూటింగ్ మొదలుపెడదామన్నామని అన్నట్టు ఆయన తెలిపారు.

కానీ తాను అనుకున్న క్లైమాక్స్‌ మాత్రం తన మైండ్‌ నుంచి పోలేదని, ఆ సీన్‌కొచ్చే సరికి ఏదీ సెట్‌ కాక రామానాయుడు గారి దగ్గరికి వెళ్లి, మాట్లాడాలని చెప్పి ఒక రూంలోకి వెళ్లి ఆయన కాళ్లు పట్టేసుకున్నానని ఆయన వివరించారు.ఇదొక్క సారి ఈ క్లైమాక్స్ పెట్టనివ్వండి అని ఆయన్ను బతిమాలుకున్నట్టు ఆయన చెప్పారు.ఆయన అయిష్టంగానే ఒప్పుకున్నా షూటింగ్ అయిపోయాక చాలా మెచ్చుకున్నారని డైరెక్టర్ చంద్ర మహేష్ స్పష్టం చేశారు.

వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 
Advertisement

తాజా వార్తలు