కేసిఆర్ దూకుడు వెనుక పీకే ? 

కేంద్ర అధికార పార్టీ బీజేపి  పై తెలంగాణ సీఎం కేసీఆర్ గతంలో ఎన్నడూ లేనివిధంగా ఫైర్ అవుతున్నారు.సోమరిపోతు ప్రభుత్వం అంటూ కేంద్రంపై విమర్శలు చేస్తున్నారు.

  అసలు మొన్నటి వరకు బీజేపీ విషయంలో సానుకూల వైఖరితో ఉన్నట్లుగా కేసీఆర్ వ్యవహార శైలి ఉండేది.తెలంగాణ బీజేపీ నాయకుల పై తీవ్రస్థాయిలో విమర్శలు చేసినా,  కేంద్ర బీజేపి పెద్దలతో కేసీఆర్ సఖ్యతగా మెలిగేవారు.

కానీ గత కొద్ది రోజులుగా బీజేపీ అగ్రనేతల పైన కేసీఆర్ విమర్శలు చేస్తున్నారు.ధాన్యం కొనుగోలు విషయం తో పాటు,  అనేక అంశాలపై బీజేపిని ఇరుకున పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.

గతంలో ఎప్పుడూ లేని విధంగా కేసీఆర్ ఈ స్థాయిలో బీజేపీ పై ఫైర్ అవడానికి కారణాలు చాలానే ఉన్నాయనే ప్రచారం జోరుగా సాగుతోంది.అసలు కేసీఆర్ ఈ స్థాయిలో దూకుడు పెంచడానికి కారణం ప్రశాంత్ కిషోర్ ఐ ప్యాక్ టీమ్ కారణమనే ప్రచారం జరుగుతోంది.

Advertisement

టీఆర్ఎస్ ను 2023 ఎన్నికల్లో గెలిపించే బాధ్యతను ప్రశాంత్ కిషోర్ టీమ్ తీసుకుందని ప్రచారం జోరుగా జరుగుతోంది.  దీనికి తగ్గట్లుగానే ఇటీవల ఢిల్లీ పర్యటనకు వెళ్లిన కేసిఆర్ ఆ సందర్భంగా ప్రశాంత్ కిషోర్ టీమ్ తో భేటీ అయ్యారనే ప్రచారం మొదలయ్యింది.

దీనికి తగ్గట్లుగానే కేసీఆర్ ఢిల్లీకి వెళ్లి వచ్చిన దగ్గర నుంచి దూకుడుగా వ్యవహరిస్తున్నారు.

2023 ఎన్నికల్లో విజయం సాధించాలంటే ఖచ్చితంగా బీజేపీపై ఈ స్థాయిలో ఫైర్ అవ్వాలనే సూచనలు అందించడంతో,  కేసీఆర్ శైలిలో మార్పు వచ్చిందని,  తెలంగాణ బీజేపీ నేతలు ప్రస్తావిస్తున్నారు.ప్రశాంత్ కిషోర్ టీం సలహాలతోనే ఉద్రిక్తతలు పెంచే విధంగా కేసిఆర్ ఘాటు పదజాలం ఉపయోగిస్తూ,  బీజేపీపై ఫైర్ అవుతున్నారని, ఏపీలో వైసిపి విషయంలోనూ ఇదే విధంగా ప్రశాంత్ కిషోర్ వ్యవహరించారు అని,  ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లోనూ ప్రశాంత్ కిషోర్ రాజకీయానికి కేసీఆర్ ద్వారా తెర తీయించారు అనే విమర్శలు ఎన్నో తెరపైకి వస్తున్నాయి.

నేటి ఎన్నికల ప్రచారం : బాబు అక్కడ .. జగన్ ఇక్కడ 
Advertisement

తాజా వార్తలు