తెలుగు ఎన్.ఆర్. ఐ డైలీ న్యూస్ రౌండప్ - Telugu NRI America News

1.కొత్త కరోనా వేరియంట్ .భారత్ అప్రమత్తం

దక్షిణాఫ్రికా హాంగ్ కాంగ్ లో ఇటీవల వెలుగులోకి వచ్చిన కొత్త కరోనా వేరియంట్ ప్రస్తుతం గుబులు రేపుతోంది.

ఈ క్రమంలో భారత్ కూడా అప్రమత్తమైంది.ముఖ్యంగా ఆఫ్రికా ఖండం నుంచి వచ్చే వారి విషయంలో జాగ్రత్తలు తీసుకునే విషయంలో కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులు అన్ని రాష్ట్రాలకు లేఖలు రాశారు.

2.ఆస్ట్రేలియాలో తెలుగు వ్యక్తికి అరుదైన గౌరవం

ఆస్ట్రేలియాలో తెలుగు వ్యక్తికి అరుదైన గౌరవం లభించింది.భారత సంతతికి చెందిన చెన్నుపాటి జగదీష్ అనే ప్రొఫెసర్ ను ఆస్ట్రేలియన్ అకాడమీ ఆఫ్ సైన్స్ తదుపరి అధ్యక్షుడిగా నియమించింది.

3.భారత్ తో సహా ఆరు దేశాలకు సౌదీ గుడ్ న్యూస్

కరోనా వైరస్ నేపథ్యంలో ఏడాదిన్నర కు పైగా అంతర్జాతీయ ప్రయాణీకుల విధించిన ఆంక్షలను ఒక్కో దేశం ఎత్తి వేస్తున్నాయి.తాజాగా సౌదీ అరేబియా భారత్ తో సహా ఆరు దేశాల పై విధించిన ప్రయాణ నిషేధాన్ని ఎత్తి వేశాయి.

4.లాటరీ గెలుచుకున్న భారత మహిళ

మహజుజ్ లక్కీ డ్రా లో భారత మహిళ ఒకరు జాక్ పాట్ కొట్టారు.దుబాయ్ లో నిర్వహించిన మహా జుజ్ 52 వ వీక్లీ డ్రా లో భారత్ కు చెందిన విద్య (31) 20 లక్షలు గెలుచుకున్నారు.

5.  జర్మనీలో కొత్త కరోనా వేరియంట్

జర్మనీలో కొత్త కరోనా వేరియంట్ బయటపడింది.రోజుకు 70 6 వేలకు పైగా కొత్త కేసులు నమోదు అవుతుండటం ఆందోళన కల్గిస్తోంది.

6.దక్షిణాఫ్రికా దేశాల నుంచి వచ్చే విమానాలపై ఫ్రాన్స్ నిషేధం

ఆఫ్రికా దక్షిణ దేశాల్లో విస్తరిస్తున్న కరోనా మహమ్మారి యూరప్ దేశాల్లో కలవరం పుట్టిస్తోంది.ఈ నేపథ్యంలో ఆఫ్రికా దేశాల నుంచి వచ్చే విమానాలపై ఫ్రాన్స్ 48గంటల నిషేధం విధించింది.

7.ఆఫ్రికా దేశాల నుంచి వచ్చే వారిపై ఇటలీ నిషేధం

Advertisement

ఆఫ్రికా దేశం లో కరోనా తీవ్రంగా విజృంభిస్తుండడం,  కొత్త వేరియంట్ బయటపడడంతో ఆఫ్రికా దేశాల నుంచి వచ్చే ప్రయాణికుల పై ఇటలీ నిషేధం విధించింది.

8.ఇజ్రాయిల్ లో కొత్త కరోనా వేరియంట్ కేసులు

దక్షిణాఫ్రికాలో బయటపడిన కరోనా కొత్త వేరియంట్ బి.1.1.529 ఇప్పుడు ప్రపంచ దేశాలను వణికిస్తోంది.ఇప్పుడు ఈ వేరియంట్ ఇజ్రాయిల్ కి పాకింది.ఆఫ్రికా దేశాల నుంచి ఇజ్రాయిల్ వచ్చిన వాళ్లు ఈ వైరస్ లక్షణాలు బయటపడడంతో వారందర్నీ క్వారంటైన్ లో ఉంచింది.

9.ఎన్ ఆర్ ఐ లకు సీబీఎస్సి శుభవార్త

విదేశాల్లో ఉన్న నాన్ రెసిడెంట్ ఇండియన్ లకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ( సీబీఎస్సి) శుభవార్త చెప్పింది.సీబీఎస్సీ కి సమానమైన సిలబస్ అందించని విదేశీ బోర్డులకు అనుబంధంగా ఉన్న స్కూళ్ల లో చదివిన విద్యార్థులకు ఎటువంటి అప్రూవల్ లేకుండానే అడ్మిషన్లు పొందే అవకాశం కల్పించింది.

10.హాలీవుడ్ కి సమంత .బై సెక్సువల్ పాత్రలో

సమంతకు హాలీవుడ్ ఆఫర్ వచ్చింది.ఇంటర్నేషనల్ ఫిలిం డైరెక్టర్ ఫిలిప్ జాన్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో సమంత కు అవకాశం వచ్చింది.

బైసెక్సువల్ పాత్రలో ఆమె నటించనుంది.

వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 
Advertisement

తాజా వార్తలు