రూ.కోట్లు పోగొట్టుకున్న గుండు హనుమంత్ రావు కథ తెలిస్తే కన్నీళ్లు పెట్టుకుంటారు!

సినిమా జీవితం అంటేనే ఓ రంగుల ప్రపంచం.ఈ రంగుల ప్రపంచంలో ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోలేము.

అలాగే సినిమా ఇండస్ట్రీలో కొనసాగాలంటే ఎంతో ధైర్యం కూడా ఉండాలి అని చెప్పాలి.ఇండస్ట్రీలో ఉంటే ఎవరి జీవితం ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరికీ తెలియదు.

కొందరి జీవితంలో మాత్రం అదృష్టం తలుపు తడితే రాత్రికి రాత్రే సెలబ్రిటీలుగా మారి పోతారు.లేకపోతే ఇండస్ట్రీలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ అవకాశాల కోసం ఎదురు చూస్తూ మరి కొందరు వారి జీవితాలను నాశనం చేసుకుంటూ ఉంటారు.

అదేవిధంగా ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటిస్తూ మంచి నటుడిగా గుర్తింపు పొందిన వారు వారి జీవితం పై అవగాహన లేక సంపాదించిన డబ్బులు మొత్తం దానధర్మాల పేరుతో ఖర్చు చేస్తూ చివరికి అనాధలుగా మరణించిన వారు ఎంతోమంది ఉన్నారు.అదేవిధంగా ఇండస్ట్రీలో మంచి అవకాశాలతో డబ్బులు సంపాదించుకొని చివరి క్షణాలలో కూడా ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్న వారు కూడా ప్రతి ఒక్క ఇండస్ట్రీలోనూ ఎంతోమంది ఉన్నారు.

Advertisement

అలా మన తెలుగు ఇండస్ట్రీలో గుండు హనుమంత్ రావు ఒకరని చెప్పవచ్చు.ఈయన అప్పట్లో బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు, ఆలీ వంటి వారితో ఎన్నో సినిమాలలో నటించి విశేష ప్రేక్షకాదరణ దక్కించుకున్నారు.

ఈ క్రమంలోనే ఎన్నో అవకాశాలను అందుకుంటూ బాగా ప్రేక్షకాదరణ సంపాదించుకున్న హనుమంత్ రావు కేవలం వెండి తెరపై మాత్రమే కాకుండా బుల్లితెరపై అమృతం వంటి సీరియల్ ద్వారా బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.తన జీవితం ఎంతో సాఫీగా సాగిపోతుందనుకున్న సమయంలో దురదృష్టం ఇతని తలుపు తట్టి తన భార్య కూతురుని ఆ భగవంతుడు తీసుకెళ్ళిపోయాడు.ఇక తన భార్య కూతురు మరణంతో ఎంతో కుంగిపోయిన ఈయన తన కొడుకే తన సర్వస్వంగా బతికారు.

ఈ క్రమంలోనే తన కొడుకును ఉన్నత చదువులు చదివించడం కోసం అమెరికాకు పంపించి తాను సంపాదించిన మొత్తాన్ని తన కొడుకు చదువులకే ఖర్చు చేశారు.అయితే అనుకోకుండా ఈయన కిడ్నీ వ్యాధితో బాధపడుతుంటే ఉన్న డబ్బు మొత్తం తన కొడుకు చదువులకు పెట్టగా తన ఆరోగ్యం క్షీణించడంతో తన కొడుకు తన తండ్రిని కాపాడుకోవటానికి తన ఆశయాన్ని పక్కనపెట్టి తిరిగి ఇండియాకి చేరుకొని తన తండ్రికి సేవలు చేశారు.అయితే గుండు హనుమంత్ రావు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్న తన కష్టాలను ఎవరికీ చెప్పుకోలేదు.

ఈ క్రమంలోనే ఒకానొక సమయంలో అలీ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న కార్యక్రమంలో పాల్గొన్న ఈయన అసలు విషయాలని తెలియజేయడంతో అలీ ఎంతో చలించిపోయి తన కొడుకు ఉద్యోగ బాధ్యతలను తాను తీసుకుంటానని అలాగే తనకు ఏ అవసరం వచ్చినా కానీ ఒక్క ఫోన్ చేయమని ఇచ్చారు.ఇలా ఇండస్ట్రీలోఎంతో సంపాదించుకొన్నప్పటికీ చివరికి ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొని ఒకరిపై ఆధారపడి ఉన్న పరిస్థితులు గుండు హనుమంత్ రావుకి ఎదురయ్యాయని చెప్పవచ్చు.

వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 
Advertisement

తాజా వార్తలు