సినిమా ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో కొందరు కమెడియన్లు గా తమ సినీ కెరీర్ ని మొదలు పెట్టి క్రమక్రమంగా హీరోలుగా అవకాశాలు దక్కించుకొని తమ నటనా ప్రతిభతో సినీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న హీరోలు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు.ఈ క్రమంలో ఇలా ఎంట్రీ ఇచ్చిన వారిలో సునీల్, శ్రీనివాస్ రెడ్డి, షకలక శంకర్, సప్తగిరి సుడిగాలి, సుదీర్ తదితరులు బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులని బాగానే ఆకట్టుకున్నారు.
కాగా తాజాగా హీరో మరియు కమెడియన్ సప్తగిరి మరోమారు హీరోగా ప్రేక్షకుల్ని అలరించబోతున్నాడు.
కాగా ప్రస్తుతం సప్తగిరి తెలుగులో “e I g h t 8” అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు.
ఈ చిత్రం లో సప్తగిరి కి జోడిగా ఉల్లాసంగా ఉత్సాహంగా మూవీ ఫేమ్ స్నేహ ఉల్లాల్ నటిస్తోంది.అలాగే 7/జి బృందావన్ కాలనీ హీరోయిన్ సోనీ అగర్వాల్ ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటిస్తోంది.
అలాగే బాలీవుడ్ సినిమా పరిశ్రమకు చెందిన పలువురు సినీ ప్రముఖులు ఈ చిత్రంలో విలన్ పాత్రలో నటిస్తున్నారు.కాగా ఈరోజు దీపావళి పర్వదినం కావడంతో చిత్ర యూనిట్ సభ్యులు ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక టీజర్ ని విడుదల చేశారు.

అయితే ఈ టీజర్ ని ఒకసారి పరిశీలించినట్లయితే నటుడు సప్తగిరి “100 మందిలో ఒకడిగా బ్రతకడం కాదు” అంటూ చెప్పేటువంటి డైలాగ్ మొత్తం టీజర్ హైలెట్ గా నిలిచింది.ఇక ఇతర నటీ నటులు కూడా తమ పాత్రలకి బాగానే న్యాయం చేశారని చెప్పవచ్చు.కాగా ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం, తదితర భాషలలో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సభ్యులు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.మొత్తానికి టీజర్ తో ప్రేక్షకులని బాగానే అలరించిన సప్తగిరి మరి సినిమాతో ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటాడో చూడాలి.

అయితే ఈ విషయం ఇలా ఉండగా గతంలో కూడా నటుడు సప్తగిరి సప్తగిరి ఎక్స్ప్రెస్, సప్తగిరి ఎల్.ఎల్.బి తదితర చిత్రాలతో ప్రేక్షకులను అలరించాడు.దీంతో ప్రస్తుతం ఒకపక్క కమెడియన్ పాత్రలలో నటిస్తూనే మరో పక్క సినిమాల్లో హీరోగా కూడా నటిస్తూ బాగానే అలరిస్తున్నాడు.







