ఆ హాట్ బ్యూటీ దర్శక నిర్మాతలతో అందినంత రెమ్యూనరేషన్ గుంజుతుందట....

సినిమా అనేది రంగుల ప్రపంచం.ఇక్కడ రాణించాలంటే పెద్దగా చదువు సంధ్యలతో అవసరం లేకపోయినప్పటికీ మనుషులతో ఎలా మెలగాలి మరియు ఇండస్ట్రీలో మనకి ఉన్నటువంటి క్రేజ్ మరియు ఫ్యాన్ ఫాలోయింగ్ ను ఎలా ఉపయోగించుకోవాలనే విషయాలపై అవగాహణ కచ్చితంగా ఉండాలి.

 Telugu Young Heroine Demands Huge Remuneration For Day Details, Telugu Young Her-TeluguStop.com

అయితే ఈ మధ్య కాలంలో ఓ హీరోయిన్ దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న సామెతను చాలా బలంగా నమ్ముతూ ముందుకు వెళుతోంది.ఈ క్రమంలో తన డిమాండ్లతో దర్శక నిర్మాతల దగ్గర అందినంత డబ్బు గుంజుతుందట.

పూర్తి వివరాల్లోకి వెళితే ఇటీవల తెలుగులో పలు వెబ్ సిరీస్ మరియు చిత్రాలలో బోల్డ్ షో చేసి మంచి క్రేజ్ సంపాదించుకున్న ఓ యంగ్ హీరోయిన్ ప్రస్తుతం దర్శక నిర్మాతలకు పారితోషికం విషయంలో చెమటలు పట్టిస్తోంది.కాగా ఈ అమ్మడు తమ చిత్రంలో నటించే సమయంలో రోజుకి రెండు లక్షల రూపాయలకు పైగా రెమ్యూనరేషన్ ఛార్జ్ చేస్తోందట.

అంతటితో ఆగకుండా రోజువారి ఖర్చుల కింద కారు బాడుగ మరియు హోటల్ రూమ్ వంటి వాటికి మరో 20 వేల రూపాయలు అదనంగా దండుకుంటుందని పలు వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

Telugu Directors, Producers, Telugu Young, Tollywood-Movie

దీంతో ఇప్పటికే కొంతమంది దర్శక నిర్మాతలు ఈ అమ్మడికి సినిమా ఆఫర్లు ఇవ్వాలంటే ఖర్చులు చూసి భయపడుతున్నారని టాలీవుడ్ సినిమా పరిశ్రమలో చర్చించుకుంటున్నారు.అయితే ఈ హీరోయిన్ ఇటీవలే హైదరాబాద్ లో ఉన్నటువంటి గచ్చిబౌలి ఏరియా కి షిఫ్ట్ అయిందని దాంతో పాటు దాదాపుగా 50 లక్షల రూపాయలు ఖర్చు చేసి ఖరీదైన లగ్జరీ కారును కూడా కొన్నదట.

Telugu Directors, Producers, Telugu Young, Tollywood-Movie

దీంతో కొందరు నెటిజన్లు ఈ విషయంపై స్పందిస్తూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.మామూలుగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో సినిమా ఇండస్ట్రీలో యువ నటీనటులకు రెమ్యూనరేషన్ తక్కువ మోతాదులో ఉంటుందని అలాంటిది ఆ యంగ్ హీరోయిన్ కోట్ల రూపాయల విలువ చేసే మరియు ఖరీదైన కారుని ఎలా కొన్నది అంటూ కామెంట్లు చేస్తున్నారు.మరికొందరైతే ఇంత విలాసవంతమైన జీవితాన్ని అనుభవిస్తున్న ఆ హాట్ బ్యూటీ ఎవరా అంటూ సోషల్ మీడియాలో తెగ వెతుకుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube