ఆ సీరియల్ ని ఓ రేంజ్ లో ప్రమోట్ చేసిన రాజమౌళి, రానా.. కానీ కొన్ని రోజులకే?

ఏదైనా సినిమా లేదా సీరియల్ విషయంలో ముందుగానే ఆ సినిమాకు లేదా సీరియల్ కు మంచి ఆదరణ రావడానికి ఆ సినీ బృందాలు ఎంతో కష్టపడి స్టార్ డైరెక్టర్ లతో, స్టార్ హీరోలతో ఓ రేంజ్ లో ప్రమోట్ చేస్తూ ఉంటారు.

కానీ అవి తెరమీదికి వచ్చాక కొన్ని కొన్ని సార్లు నిరాశ పరుస్తుంటాయి.

దీంతో ప్రమోషన్ లో భాగంగా పాల్గొన్న సెలబ్రెటీలు కానీ సిని బృందాలు కానీ బాగా అవమానం ఎదుర్కొన్నట్లు ఫీలవుతుంటారు.ఇదిలా ఉంటే గతంలో రాజమౌళి, రానా ఏకంగా ఓ సీరియల్ ను ఓ రేంజ్ లో ప్రమోట్ చేశారు.

కానీ ఆ సీరియల్ కొన్ని రోజులకే ప్రేక్షకులను నిరాశ పరిచింది.అసలేం జరిగిందంటే ఆ సమయంలో రాజమౌళి పాన్ ఇండియా మూవీ బాహుబలి సినిమా షూటింగ్ లో బాగా బిజీగా ఉన్నాడు.

దీంతో అదే సమయంలో ఈటీవీ లో మేఘమాల అనే కొత్త సీరియల్ ప్రారంభమయ్యింది.ఇక ఈ సీరియల్ ను మరింత ముందుకు నడిపించడానికి ప్రమోషన్ లో భాగంగా సీరియల్ బృందం ఏకంగా రాజమౌళి, రానా తో ప్రమోట్ చేయించారు.

Advertisement

ఇక ప్రమోషన్ భాగంలో రాజమౌళి వీడియో బైట్ విడుదల చేశారు సీరియల్ బృందం.

ఇక అందులో రాజమౌళి మాట్లాడుతూ సినిమా అనేది రంగుల ప్రపంచం అంటూ చాలా కలర్ ఫుల్ బ్యాక్ డ్రాప్ అని ఏ కథకైనా సరే ఇలాంటి బ్యాక్ డ్రాప్ లో వస్తుంది మేఘమాల అనే సీరియల్ అని ఇది ఈటీవీ లో ప్రసారం అవుతుందని దీంతో మీరు ఈ సీరియల్ ఇష్టపడతారని ఆశిస్తున్నానని తెలిపాడు రాజమౌళి.ఇక రానా కూడా ఈ సీరియల్ గురించి కొన్ని విషయాలు తెలుపుతూ వీడియో బైట్ ద్వారా ఈ సీరియల్ ను ప్రమోట్ చేసాడు.దీంతో ఈ సీరియల్ ప్రేక్షకులను మొదట్లో బాగా మెప్పించింది.

కానీ రాను రాను ఈ సీరియల్ పట్ల వారికి ఆసక్తి అనేది పోయింది.దీంతో ఈ సీరియల్ ప్రమోషన్ భాగంలో మాట్లాడిన రాజమౌళి, రానా ను మరోసారి గుర్తుకు చేసుకున్నారు బుల్లితెర ప్రేక్షకులు.

ఇక రాజమౌళి కూడా వెండి తెరపై కాకుండా బుల్లితెరపై కూడా ఓ సీరియల్ లో నటించాడు.ఈ విషయం చాలా వరకు ఎవరికి తెలియక పోగా గతంలో రాజమౌళి మాత్రం ఓ సీరియల్ లో కనిపించాడు.యాట సత్యనారాయణ దర్శకత్వంలో ఒకప్పుడు తెలుగు ప్రేక్షకులను మెప్పించిన సీరియల్ చంద్రముఖి.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?

ఇక ఈ సీరియల్ కు ముఖ్య అతిథిగా తలుకుమన్నాడు రాజమౌళి.ఈ సీరియల్ సమయంలో రాజమౌళి మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు.

Advertisement

దీంతో చంద్రముఖి సీరియల్ అప్పటికే 1500 ఎపిసోడ్ పూర్తవడంతో ఆ సందర్భంగా ఆ సీరియల్ ఎపిసోడ్ కు రాజమౌళి డైరెక్ట్ చేస్తూ ఓ సన్నివేశంలో నటించాడు.ఇక ఈ సీరియల్ అప్పట్లో బుల్లితెర ప్రేక్షకులను బాగా మెప్పించింది.

రాజమౌళి కూడా పలు సీరియల్స్ కు దర్శకత్వం వహించాడు.

తాజా వార్తలు