'రాధేశ్యామ్' టీజర్ కు ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడంటే?

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరోయిన్ గా రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా రాధేశ్యామ్.

రాధే శ్యామ్ సినిమా షూటింగ్ పూర్తి అయ్యి విడుదలకు సిద్ధంగా ఉంది.

ఇంకా చిన్న చిన్న ప్యాచ్ వర్క్ మాత్రమే బాలన్స్ ఉందని సమాచారం.అయితే ఈ సినిమా టీజర్ కోసం ప్రభాస్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

వీరి ఎదురు చూపులకు సమయం ఆసన్నమైనట్టు తెలుస్తుంది.ఇటీవలే పూజా హెగ్డే పుట్టిన రోజు సందర్భంగా ఒక బ్యూటిఫుల్ పోస్టర్ ను విడుదల చేస్తూ ప్రేరణ పాత్రను అభిమానులకు పరిచయం చేసారు.ఈ సినిమాలో పూజా లుక్ అభిమానులను బాగా ఆకట్టుకుంది.

ఇక ఇప్పుడు ప్రభాస్ పుట్టిన రోజు రాబోతుంది.ఈ సందర్భంగా ఈ సినిమా నుండి టీజర్ వస్తుందని సమాచారం.

Advertisement

అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టిన రోజు.ఈ సందర్భంగా రాధే శ్యామ్ నుండి టీజర్ రాబోతుందని సమాచారం అందుతుంది.

అయితే ఈ విషయంపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.అయితే ఇది నిజమో కాదో తెలియక పోయిన ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇక ఈ సినిమాను యువీ క్రియేషన్స్ వారు భారీ స్థాయిలో పాన్ ఇండియా సినిమాగా నిర్మిస్తున్నారు.

వచ్చే ఏడాది జనవరిలో సంక్రాంతి కానుకగా విడుదల చేయబోతున్నారు.మరి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఈ సినిమా ఎంత మ్యాజిక్ చేస్తుందో వేచి చూడాల్సిందే.ఇక ప్రభాస్ ఈ సినిమాతో పాటు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్, ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ సినిమాలు చేస్తున్నాడు.

పోలింగ్ ఏజెంట్ల నియామకంపై ఈసీ ఆదేశాలు
తల్లికి 15 లక్షల విలువ చేసే జ్యూవెలరీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్.. ఈ కొడుకు గ్రేట్ అంటూ?

ఇంకా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో మరొక సినిమా తెరకెక్కుతుంది.ఇన్ని సినిమాలు చేతిలో ఉండగానే సందీప్ వంగ దర్శకత్వంలో స్పిరిట్ సినిమా అనౌన్స్ చేసి ఫ్యాన్స్ ను సర్ప్రైజ్ చేసాడు.

Advertisement

తాజా వార్తలు