కొత్త టీమ్ కి కెప్టెన్ గా డేవిడ్ భాయ్..?!

సన్‌రైజర్స్ హైదరాబాద్ పేరు చెప్పంగానే వినపడేది డేవిడ్ వార్నర్ పేరే.ఈయన సన్ రైజర్స్ కు గతంలో కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టారు.

అయితే ప్రస్తుతం తాను రాబోయే సీజన్ లో కొత్త టీమ్ కు కెప్టెన్ గా ఉండటానికి రెడీగా ఉన్నాడు.ఈ సీజన్లో ఆయన సన్‌రైజర్స్ హైదరాబాద్ కు కెప్టెన్ గా వ్యవహరిస్తూ కేవలం 8మ్యాచ్ లే ఆడాడు.2016వ సంవత్సరంలో కూడా ఫ్రాంచైజీకి ఐపీఎల్ టైటిల్ తెచ్చిపెట్టిన వార్నర్ ను అనుకోకుండా పక్కకు పెట్టడంపై చాలా సందేహాలు మెదులుతున్నాయి.లీగ్ మ్యాచ్ లతో సరిపెట్టుకుని ఇంటి బాట పట్టడంతో వార్నర్ ఓ ఇంటర్వ్యూలో తన మనోగతాన్ని బయటపెట్టాడు.

కొన్ని రోజుల ముందుగానే ఐపీఎల్ 2022కు మరో రెండు జట్లు రానున్నట్లు బీసీసీఐ తెలిపింది.అయితే ఆ జట్ల కోసం వేలం నిర్వహించాల్సి ఉంది.అక్టోబర్ 25తో అది ముగుస్తుంది.

ఈ నేపథ్యంలో వార్నర్ మెంటల్ గా ఫిక్స్ అయ్యాడు.తాను చాలా ఎనర్జిటిక్ గా ఉంటానని, కొత్త ఉత్సాహంతో పనిచేస్తానని, అందుకే వేరే జట్టులో ఆడటానికి అవకాశం వస్తే తాను సిద్దంగా ఉన్నట్లు తెలిపారు.

Advertisement

తాను హైదరాబాద్ జట్టులో ఉన్నప్పుడు చాలా మంది పెద్దలతో కలిసి పనిచేశానని, రషీద్ ఖాన్ అఫ్ఘాన్ జట్టు కెప్టెన్, కేన్ విలియమ్సన్, జాసన్ హోల్డర్లు, ఇంకా మరికొందరు ప్రముఖులతో పనిచేసినట్లు చెప్పుకొచ్చాడు.

వారి నుంచి మరిన్ని మెలకువలు నేర్చుకున్నానని, ఇకపై మరింత ఫామ్ తో ఆడుతానని తెలిపాడు.ఢిల్లీ క్యాపిటల్స్ తో వార్నర్ ఐదేళ్ల పాటు కొనసాగాడు.ఆ తర్వాత 2014లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో చేరాడు.ఇకపోతే 2015వ సంవత్సరంలో సన్ రైజర్స్ కు కెప్టెన్ గా బాధ్యతలు నిర్వహించాడు.2016వ సంవత్సరంలో 848 రన్స్ చేసి టీమ్ ను పటిష్టంగా నడిపాడు.ఐపీఎల్ మొత్తంలో వార్నర్ 150 మ్యాచ్ లు ఆడగా అందులో 5449 పరుగులు చేశాడు.

Advertisement

తాజా వార్తలు