లక్షలు సంపాదిస్తోన్న బాతు.. యజమానికి పండగే పండగ..!

చాలా మంది తమకు ఇష్టమైన జంతువులను పెంచుకుంటూ ఉంటారు.పక్షులు, జంతువులను తమతో సమానంగా పెంచే యజమానులు కూడా ఉన్నారు.

అందులో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది కుక్క.అనేక మంది తమ ఇళ్లలో కుక్కలను పెంచుకుంటూ ఉంటారు.

ఎందుకంటే ఆ కుక్క ఎంతో విశ్వాసం కలది కాబట్టి.అయితే ఇక్కడొక అమ్మాయి తనకు ఇష్టమైన బాతును పెంచుకుంది.

ఆ బాతు వల్ల అమ్మాయి చాలా ఫేమస్ అయ్యింది.ఆ బాతు కూడా తన యజమానురాలికి డబ్బులు సంపాదించి పెడుతోంది. పెన్సిల్వేనియాలోని మిల్‌ఫోర్డ్‌ లోమం‍చ్‌కిన్‌’ అనే బాతు బాగా పాపులర్ అయ్యింది.20 సంవత్సరాల క్రిస్సీ ఎలిస్‌ అనే అమ్మాయి బాతును పెంచుకుంటోంది.ఇప్పుడు ఆ బాతు ప్రపంచంలోనే అత్యంత ఎక్కువగా డబ్బులు సంపాదించే బాతుగా హిస్టరీ క్రియేట్ చేసింది.

Advertisement

క్రిస్సీకి చిన్నతనం నుంచి కూడా బాతులను పెంచుకోవడం అంటే చాలా ఇష్టం.ఆ అలవాటుతోనే ఆమె ఓ బాతును పెంచుకుంది.ఆ బాతుకు మంచ్ కిన్ అనే పేరు పెట్టింది.

ఆ తర్వాత కొన్ని రోజులకు సోషల్‌ మీడియాలో తన బాతుతో కలిపి ‘డంకిన్‌ డక్స్‌’ అనే పేరుతో కామన్‌ ఎకౌంట్‌ ను క్రిస్సీ రెడీ చేసుకుంది.తాను ఉండే ప్రాంతంలో ఓ ఫాస్ట్‌ ఫుడ్‌ సెంటర్‌ ఉంది.

ఫుడ్ సెంటర్ పేరు డంకిన్‌ డొనట్స్‌.ఆ పేరు స్ఫూర్తితోనే తమ అకౌంట్ కు ఆ పేరు పెట్టుకుంది.

ఆ తర్వాత సోషల్ మీడియాలో తనతో పాటు బాతు ఉన్న ఫొటోలను, వీడియోలను పోస్ట్‌ చేయడం మొదలు పెట్టింది.కాలక్రమేణా వారికి టిక్‌టాక్‌ లో 2.7 లక్షలు, ఇన్‌స్టాగ్రామ్‌ లో 2.5లక్షలు మంది ఫాలోవర్స్‌ పెరిగారు.తనకున్న రెండు సోషల్‌ మీడియాల ద్వారా నెలకు 3 లక్షల రూపాయలను ఆ బాతు సంపాదిస్తోంది.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?

అంతేకాకుండా ఆ బాతు పెయింటింగ్‌ లు వేయడం ద్వారా కూడా డబ్బులు వస్తున్నాయి.దీంతో న్యూయార్క్ పోస్ట్ ఆ బాతును కష్టపడి పనిచేసే పెట్‌ అని ప్రశంసించింది.

Advertisement

తాజా వార్తలు