పెండ్ల‌యిన ప‌దిరోజుల‌కే భార్య ఎనిమిది నెల‌ల గ‌ర్భ‌వ‌తి.. సినిమాను మించిన ట్విస్టు..

ఈ మ‌ధ్య కొన్ని దారుణాలు చూస్తుంటే ప్ర‌తి ఒక్క‌రి మైండ్ బ్లాంక్ అయిపోతోంది.

మ‌రీ ముఖ్యంగా పెండ్లి స‌మ‌యాల్లో లేదంటే న‌వ వ‌ధువుల విష‌యం బ‌య‌ట‌ప‌డే కొన్ని విషయాల‌కు సంబంధించిన వార్తలు విప‌రీతంగా వైర‌ల్ అవుతున్నాయి.

ఇక తాజాగా ఇలాంటి ఘ‌ట‌నే ఒక‌టి ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ కోటలోని సరాయ్ ఏరియాలో జ‌ర‌గ‌డం అంద‌రినీ షాక్‌కు గురి చేస్తోంది.అస‌లు అలా ఎలా అంటూ నెటిజ‌న్లు విప‌రీతంగా ఆశ్చ‌ర్యానికి గుర‌వుతున్నారు.

ఎందుకంటే ఓ జంట‌కు పెళ్లి అయిన 10 రోజుల‌కే భార్య గ‌ర్భ‌వ‌తి కావ‌డంతో వ‌రుడికి మెంట‌ల్ ఎక్కిపోయింది.ఎందుకంటే త‌న‌కు పెండ్ల‌యి ప‌ది రోజులు కాకుండా భార్య 8 నెలల గర్భవతి ఎలా అయ్యింద‌ని త‌ల ప‌ట్టుకున్నాడు.

ఈ వార్త ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.కోట ప్రాంతంలో నివాసం ఉంటున్న ఓ యువకుడికి అదే ఏరియాలో నివాసం ఉంటున్న మ‌రో యువ‌తికి రీసెంట్‌గా పెండ్లి అయింది.

Advertisement

స‌రిగ్గా పెండ్లి అయిన పది రోజుల క్రితం అకస్మాత్తుగా అమ్మాయికి కడుపు నొప్పి రావడంతో వెంట‌నే అల‌ర్ట్ అయిన వ‌రుడు ఆమెను స్థానికంగా ఉండే ఆస్పత్రికి తీసుకెళ్లాడు.అయితే డాక్ట‌ర్లు ఆమెను చెక్ చేసి ఫ్యూజులు ఎగిరిపోయే వార్త చెప్పారు.

ఆమె 8 నెలల గర్భవతి అని చెప్ప‌డంతో అంతా షాక్ అయిపోయారు.కాగా ఇక్క‌డే వ‌ధువు త‌ల్లిదండ్రులు ప్లాన్ వేసి త‌మ కూతురికి వరుడికి చాలా రోజుల ముందే నుంచే రిలేష‌న్ ఉందని సంచ‌ల‌న ఆరోపణ‌లు చేశారు.కాగా పెండ్లి కొడుకు స్పందిస్తూ తాను అస‌లు టచ్ చేయ‌కుండా ఎలా గ‌ర్భ‌వ‌తి అయిందో చెప్పాలంటూ ప్ర‌శ్నించాడు.

కాగా అస‌లు ఆ అమ్మాయికి లక్నోకు చెందిన మ‌రో అబ్బాయితో అక్ర‌మం సంబంధం ఉంద‌ని, అందువ‌ల్లే ఆమె గ‌ర్భ‌వ‌తి అయిందంటూ ఆరోపిస్తున్నారు.దీంతో ఈ విష‌యంపై పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు వ‌రుడి త‌ర‌ఫున బంధువులు.

తల్లీదండ్రులు మట్టి కార్మికులు.. 973 మార్కులు సాధించిన శ్రావణి.. ఈమె సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!
Advertisement

తాజా వార్తలు